25 July, 2026 | 1:47 AM

నేలకొండపల్లిలో విద్యాసంస్థల బంద్ ప్రశాంతం

25-07-2026 12:00 AM

నేలకొండపల్లి, జులై 24 (విజయక్రాం తి): నేలకొండపల్లి మండల కేంద్రంలో శుక్రవారం విద్యా సంస్థల బంద్ ప్రశాంతంగా ముగిసింది.. నీట్ పేపర్ లీకేజీకీ వ్యతిరేకంగా విద్యార్ధి సంఘాలు పిలుపు మేరకు యువజన కాంగ్రెస్ అధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ లో ఆయా పాఠశాల కు వెళ్లి బంద్ విజయవంతం చేయాలని కోరారు..

ఈ సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ మాట్లాడుతూ ఢీల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వివాదానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.. అదే విధంగా విద్యార్థులకు తరుపున ప్రశ్నించే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు... కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు..

ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు యడవల్లి నాగరాజు,నేలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీ 12వ వార్డు నెంబర్ రాయపూడి రోహిత్,కొమ్మూరి నరేష్,లంజపల్లి వీరబాబు,తోట ధనుష్,కైలాసపు గోపి,గుండు మహేష్,  నవీన్,విద్యార్థి నాయకులు పగిడికత్తుల నవీన్,కైలాసపు రేణు,తాత దిలీప్,భూక్య వినయ్,గోపి పండు, నవీన్, వేణు, సాయి, నిశాంత్, తేజ, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు...