25 July, 2026 | 1:47 AM

నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన

25-07-2026 12:00 AM

ముకరంపుర, జూలై 24 (విజయక్రాంతి): న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీలను అరెస్ట్ చేయడాన్ని, ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై జరిపిన లాఠీ ఛార్జ్ ను తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని పలు డివిజన్లలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో ప్రజాస్వామ్య గొంతును అణచివేయలేరని అన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన  దమనకాండ, లాఠీ ఛార్జ్కు ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడుపు మోహన్, శ్రావణ్ నాయక్, కంకణాల అనిల్, స్వామి గౌడ్ పెంట శేఖర్, పత్యం రాజేష్, బి శ్రీనివాస్, గద్దెల సుజాత, శంకర్, తదితరలు పాల్గొన్నారు.