25 July, 2026 | 12:40 AM

సూర్యాపేటలో విద్యా సంస్థల బంద్ విజయవంతం

25-07-2026 12:08 AM

సూర్యాపేట రూరల్ , జూలై 24: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దమనకాండను నిరసిస్తూ పి డి ఎస్ యు , ఎస్ ఫ్ ఐ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇంటర్ నుండి పీజీ వరకు నిర్వహించిన ఉన్నత విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది.నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వా మపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని, అధికారంలోకి వచ్చాక 2017, 2021, 2024లలో మూడుసార్లు నీట్ పేపర్ లీక్ చే సిందని నాయకులు మండిపడ్డారు.

దేశవ్యాప్తంగా 22.75 లక్షల మంది విద్యార్థులు పరీ క్ష రాయగా, పేపర్ లీకేజ్ కారణంగా వారి భవిష్యత్తు అంధకారంలో పడిందని, మానసిక వేదనతో 27 మంది విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి, బాధిత విద్యార్థులందరికీ తక్షణమే న్యాయం చేయాలని, లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, ఎస్ ఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, పి డి స్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, పి వై ల్ జిల్లా కోశాధికారి బండి రవి, డివిజన్ ప్రధాన కార్యదర్శి బోర లెనిన్, నాయకులు వంశీ, ప్రవీణ్, అరుణ్, మనీ, రహీం, దిలీప్, సాయితేజ, వెంకటరెడ్డి, నాని తదితరులు పాల్గొన్నారు.