ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందే!
- విద్యార్థులపై దాడులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతం
- నీట్ అవకతవకలు, ఎన్టీఏ వైఫల్యాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
- నారాయణగూడ నుంచి వై జంక్షన్ వరకు భారీ ర్యాలీ
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులను ఖండిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన విద్యాసంస్థల బంద్ రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైంది.చాలా వరకు పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా మూతప డ్డాయి.
ముందస్తుగానే పలువురు విద్యాసంస్థల యాజమాన్యాలు సెలవులు ప్రకటించా యి. జిల్లాల వారీగా విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల నాయకులు బంద్‌లో పాల్గొ ని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన లు తెలిపారు. హైదరాబాద్‌లోని నారాయణగూడ నుంచి వై జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
‘నీట్’ వైఫల్యాలకు బాధ్యత వహించాలి
విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా అణచివేత చర్యలకు పాల్పడుతోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. శాంతియుతంగా నిర సన తెలిపిన విద్యార్థులపై పోలీసుల దాడు లు ప్రజాస్వామ్యానికి మచ్చ అని విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని విద్యార్థి సంఘాలు డి మాండ్ చేశాయి.
ప్రభుత్వం డిమాండ్లపై స్పందించకపోతే దేశవ్యాప్తంగా మరింత ఉ ధృతమైన ఉద్యమాలు చేపడతామని వామపక్ష విద్యార్థి, యువజన సం ఘాల నేతలు హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి కె. మణికంఠరెడ్డి, పుట్టా లక్ష్మణ్, పీడీఎస్ నాయకులు ఎస్. అనిల్, మహేష్, పీ. నాగరాజు, ఏఐఎఫ్‌డీఎస్ పల్లె మురళి, గడ్డం నాగార్జున, డీవైఎఫ్‌ఐ కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ తదితరులున్నారు.






