5 July, 2026 | 4:33 PM

యాదవ సంఘం అధ్యక్షునిగా బండి రమేష్

05-07-2026 03:42 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మల్లికార్జున యాదవ సంఘం సమావేశంలో సంఘానికి నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా బండి రమేష్ యాదవ్, ఉపాధ్యక్షుడిగా బండి చంద్రయ్య యాదవ్ ఎన్నికయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా కాయిత కనకయ్య, బండి లచ్చయ్య, మాసం సంపత్, సంఘ నరసయ్య, కల్లూరి రమేష్, మొగిలి రమేష్, రొడ్డ మల్లేశం, ఇస్కిల్ ఐలయ్య, జెల్ల పరశురాములు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు బండి రమేష్ యాదవ్ మాట్లాడుతూ... సంఘం అభివృద్ధి, యాదవ సామాజిక వర్గ సంక్షేమం కోసం అందరినీ కలుపుకొని పనిచేస్తామని తెలిపారు. సంఘ సభ్యులు నూతన పాలకవర్గానికి అభినందనలు తెలియజేశారు.