5 July, 2026 | 4:36 PM

కల్వకుంట్ల కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం

05-07-2026 03:50 PM

తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర నాయకులు చెన్నమల్ల చైతన్య

ముకరంపుర,(విజయక్రాంతి): ఆదివారం శాతవాహన యూనివర్సిటీ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్, తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర నాయకులు చెన్నమల్ల చైతన్య మాట్లాడుతూ, జూలై 2న హైదరాబాద్‌ లోని బోడుప్పల్‌ లో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాల కేటాయింపు కోసం చేపట్టిన "భూ పోరాటం" కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది విద్యార్థులు, యువత, ఉద్యమకారులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని, ఉద్యమకారుల కుటుంబాలకు 250 గజాల స్థలం ఇస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు.తెలంగాణ ఉద్యమకారులు, రైతులు, సింగరేణి కార్మికులు, నిరుద్యోగులు మరియు అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాడుతున్న కవిత కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు సబ్బు నాగరాజు తదితరులు పాల్గొన్నారు