31 March, 2026 | 5:42 AM

బండి సంజయ్‌కి ప్రజాసమస్యలు పట్టవు

03-05-2024 01:56 AM

మతం పేరుతో యువతను రెచ్చగొట్టే పనిలో ఆయన బిజీ

బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్

కరీంనగర్, మే 2(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎంపీ బండి సంజయ్‌కి ప్రజాసమస్య లు పట్టవని, ఎంపీగా ప్రాతినిధ్యం వహించి ఆయన పైసా విలువైన అభివృద్ధి కూడా చేయలేదని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తెల్లవారుజామున ఆయన ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలి సి నగరంలోని ఆరట్స్ కాలేజ్ మైదానంలో వాకర్స్‌ను కలిశారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు. బండి సంజయ్ ఎంపీగా ఒక్క మున్సిపల్ సమావేశానికైనా, జడ్పీ సమావేశానికైనా హాజరుకాలేదన్నారు. కరీంనగర్ అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు.

ఆయన కులం, మతం, ధర్మమం టూ యువతను రెచ్చగొట్టే పనిలో బిజీగా ఉంటారని విమర్శించారు. తాను రెండుసార్లు కరీంనగర్‌కు ఎంపీగా ప్రాతినిథ్యం వహించానని, అప్పుడు తాను ప్రధాని మోదీతో సహా నాటి కేంద్ర మంత్రులను కలిసి అభివృద్ధి పనులకు నిధులు తీసుకువచ్చానని గుర్తుచేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బోయినపల్లి వినోద్‌కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు నగరంలోని జ్యోతిబా ఫూలే మైదానాన్ని, ఆరట్స్ కాలేజ్ మైదానాన్ని పార్కులుగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. ఇప్పుడు జ్యోతిబా ఫూలే పార్కు పనులు పూర్తయ్యాయని, ఆరట్స్ కాలేజ్ మైదానంలో పనులు తుది దశకు వచ్చాయన్నారు.

రెండు పార్కుల్లో ప్రతిరోజూ సుమారు 700 మంది వాకర్స్ వ్యాయామం చేస్తారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే నగరాభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో నగర మేయర్ వై.సునీల్‌రావు, కార్పొరేటర్లు వాల రమణారావు, నాయకులు కంసాల శ్రీనివాస్, గందె మహేష్, గూడూరు మురళి,ఆది మల్లేశం, దూలం సంపత్ గౌడ్, కర్ర సూర్యశేఖర్, వరప్రసాద్ పటేల్, కరీం పాల్గొన్నారు.