13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

వెల్ఫేర్ బోర్డుతో గిగ్ వర్కర్లకు యూనిక్ ఐడీ

31-03-2026 01:39 AM

20 మంది సభ్యులతో ఏర్పాటు చేస్తం

అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి వివేక్

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ప్రతి వర్కర్‌కు యూనిక్ ఐడీ ఇవ్వనున్నామని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. 1-2 శాతం లెవీతో వెల్ఫేర్ ఫండ్ సిద్ధం చేసి, ఇన్ఫూరెన్స్, పెన్షన్, ప్రసూతి ప్రయోజనాలు కల్పించనున్నట్టు వెల్లడించారు.

తెలంగాణ ప్లాట్‌ఫాం ఆధారిత గిగ్ వర్కర్ల నమోదు, సామాజిక భద్రత, సంక్షేమ బిల్లు 2026ను కార్మిక శాఖ మంత్రి వివేక్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి లావాదేవీపై ఫీజు వసూలు చేసి, బోర్డు నిర్వహణ ఖర్చులకు గరిష్టంగా 5 శాతం వినియోగించనున్నామని ప్రకటించారు.

వేతనాలు, కట్టింగు ల వివరాలు స్పష్టంగా తెలియజేయడం, అల్గోరిథమ్ వినియోగంలో విపక్షలేకుండా చూడడం వంటి అంశాలను బిల్లులో చేర్చామని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక అధికారులతో పాటు ప్లాట్‌ఫామ్‌స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నామని, గిగ్ వర్కర్లకు భద్రత, హక్కులు కల్పించే దిశగా ఈ బిల్లు కీలకమని ప్రభు త్వం భావిస్తోందన్నారు. గిగ్ వర్కర్స్‌కు భద్రత కల్పించాలని ప్రభుత్వం బిల్లు తెచ్చిందని చెప్పారు. సీఎం యూనియన్ వాళ్లతో చర్చించి సమస్యలు తెలుసుకున్నామని తెలిపారు. డ్రాఫ్ట్ బిల్లు సిద్దం చేసి 30 రోజులు పబ్లిక్ డొమైన్‌లో పెట్టామన్నారు. 65 సలహాలు వచ్చాయని, వాటిని కమిటీ డ్రాఫ్ట్‌లో మెన్షన్ చేసిందని వివరించారు.