31 March, 2026 | 7:30 AM

మాటలతో మభ్యపెడుతున్న కాంగ్రెస్

03-05-2024 01:55 AM

ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్‌నగర్, మే 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మాటలతోనే ప్రజలను మభ్యపెడుతోందని ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో అయ్యేదేమీ లేదని, ప్రజలంతా బీఆర్‌ఎస్ పక్షాన ఉన్నారని అన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదామని తెలిపారు. బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రహెమాన్ తదితరులు పాల్గొన్నారు.