31 March, 2026 | 3:18 AM

27 ఎకరాల భూమిపై రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కన్ను

31-03-2026 01:37 AM
  1. భూమి విలువ 1,400 కోట్లు 
  2. సతీష్ షా కుటుంబానికి బెదిరింపులు 
  3. సీఎం, పొంగులేటి వ్యాపార బంధం వెనుక దురాగతాలు 
  4. నిషిద్ధ జాబితా పేరుతో బెదిరిస్తూ 50 శాతం భూమి వాటా డిమాండ్ 
  5. త్వరలో మరిన్ని కుంభకోణాలను బయటపెడతాం 
  6. వట్టినాగులపల్లిలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

* హర్షారెడ్డి.. ఆయన తండ్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని తీసుకుని మా ఇంటికి వచ్చారు. వాళ్లు భయపెట్టేందుకే వచ్చారు. ఆ తర్వాత హర్షారెడ్డి మొత్తం భూములు ఇవ్వమని అడిగారు. మేం ఇవ్వబోమని తేల్చిచెప్పాం. అది ఆయనకు నచ్చ లేదు. జేసీబీలు తెచ్చింది, స్టాఫ్‌ను కొట్టింది రాఘవా కన్‌స్ట్రక్షన్స్ వాళ్లే అని మా స్టాఫ్ చెప్పారు. వారు మమ్మల్ని చంపి ఇక్కడే పాతిపెడతామని బెదిరించారు. 

 సతీష్ షా, బాధితుడు

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి) : వట్టినాగులపల్లిలో సతీష్ షా కుటుంబానికి చెంది న సుమారు రూ. 1,400 కోట్ల విలువైన భూమిపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కన్నుపడిందని, అందుకే మంత్రి, ఆయన కుమారుడు హర్షారెడ్డి కలిసి స్వయంగా సతీష్ షా ఇంటికి వెళ్లి, వారి కుటుంబ భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెది రించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు.

వట్టినాగులపల్లిలో కబ్జాకు గురైన భూములను కేటీఆర్, మాజీమంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీల బృందం సోమవారం సందర్శించి, భూ నిర్వాసితులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కబ్జాకు గురైన భూమి, 1960 నుంచే నుంచి ఇప్పటివరకు సతీష్ షా కుటుంబం పేరుమీదనే భూమి ఉందని కేటీఆర్ తెలిపారు. వట్టినా గులపల్లి గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ భూముల విలువలు భారీగా పెరిగాయని పేర్కొన్నారు.

అయితే సతీష్ షా కుటుంబం భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వడానికి గానీ, అమ్మడానికి గానీ సిద్ధంగా లేమని స్పష్టంగా చేయడంతో.. మంత్రి పొంగులేటి అరాచకాలకు తెరలేపారని, తన రెవెన్యూ శాఖలోని శ్రీనివాసులు అనే అధికారి ద్వారా, రూ. 100 కోట్ల లంచం కేసులో పట్టుబడిన ఏడీతో దొంగ సర్వే చేయించి బాధితులను తీవ్రంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. భూమిని ఇవ్వకపోతే, రెవెన్యూ సర్వే పేరుతో 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారని స్పష్టంచేశారు.

దీనికీ లొంగకపోవడంతో హర్షారెడ్డి, ఆయనకు చెందిన రాఘవ కన్‌స్ట్ట్రక్షన్స్ గుండాలతో కలిసి, నెంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో వచ్చి బాధితులు నిర్మించుకున్న గోశాలను కూల్చివేశారని మండిపడ్డారు. దాదాపు కిలోమీటర్ మేర ఉన్న కాంపౌండ్ గోడను కూడా ధ్వంసం చేసి, బాధితులను భయభ్రాంతులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జేసీబీలతో వచ్చిన గూండాలు ‘మాకు భూమి ఇవ్వకుంటే ఇక్కడే సజీవంగా పాతి పెడతాం’ అని అక్కడికి వచ్చిన సతీష్ షా, పల్లవి షా కుటుంబ సభ్యులను బెదిరించారన్నారు.

రాత్రంతా వారిని నిలబెట్టారని, ఈ ఘటనపై పోలీసులు వద్ద ఫిర్యాదు చేయగా, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన.. రాష్ట్రపతి పతకం అందుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లాను బదిలీ చేశారని కేటీఆర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య ఉన్న వ్యాపార అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని ఈ దురాగతాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని కోటి ఎకరాలకు పెంచి, నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50 శాతం భూమి వాటా డిమాండ్ చేస్తోందన్నారు.

ఇలాంటి అన్యాయాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్‌కు వచ్చి వివరాలు ఇవ్వాలని, వారికి పార్టీపరంగా, న్యాయపరంగా అండగా ఉంటామని తెలిపారు. అక్రమంగా క్రషర్లు ఏర్పాటు చేసి మైనింగ్ చేస్తున్న మంత్రి పొంగులేటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించిన మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. త్వరలో మరిన్ని కుంభకోణాలను బయటపెడతామని కేటీఆర్ తెలిపారు.

మా భూమిలోనే మమ్మల్ని పాతిపెడతామని బెదిరించారు: సతీష్ షా, బాధితుడు 

‘మేం 1967 నుంచి ఇక్కడ వట్టినాగులపల్లిలో ఉంటున్నాం. ఇది కుటుంబ సమస్య కాదు. మేం సొంతంగా కొనుకున్నాం. 1968లో పార్టిషన్ జరిగింది. మ్యుటేషన్‌లో 245, 169, 244 పార్ట్‌లో మా భార్య, ఇద్దరు కూతుళ్లకు మ్యుటేషన్ అయి పట్టాదారు పాస్‌బుక్ కూడా వచ్చింది. 2017-18 హైకోర్టు ఆదేశాలతో మండల్ సర్వే జరిగింది. అప్పుడు మా పక్కవాడు కూడా అప్లికెంట్‌గా ఉన్నాడు. అప్పుడు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. 2021లో కూడా హెచ్‌ఎండీఏ భూసేకరణ చేసింది.

అప్పుడు మాకు, మా పక్కవాడికి పరిహారం ఇచ్చారు. ఇందులో దాపరికం లేదు. అన్ని హద్దులు నిర్ణయించారు. 2018-19 తర్వాత మా హద్దుల్లో గోడ కూడా కట్టుకున్నాం. అప్పు డు పక్కవాడి అభిప్రాయం తీసుకున్నాకే గోడ కట్టాం. 1969లో మా సోదరి భూమి అమ్మినప్పుడు సర్వే చేయించాలని చెప్తే అప్పుడు కూడా సర్వే చేయించాం. అప్పు డూ ఏం అభ్యంతరం చెప్పలేదు. 1968 నుంచి 2025 వరకు మా భూములకు ఎలాంటి ఇబ్బంది లేదు. నాటి నుంచి భూ మిలో మేమే ఉన్నాం.

కానీ మా పక్కవాడు కావాలనే సమస్య చేస్తున్నాడు. కానీ ఇది వారసత్వంగా వస్తున్న భూమి కాదు. 1968 నుంచి ఆ భూమిలో మేమే ఉన్నాం. దానికి సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ ఉంది. ప్రభు త్వం ఇచ్చిన సబ్సిడీలు ఉన్నాయి. ఎండాకాలంలో వేసే పైప్ లైన్లు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ ప్రాబ్లెం రాలేదు. 2025 మేలో మా పక్కవాడు 259 సర్వే నెంబర్‌లో ఉన్న అవినవ్ షా, పొంగులేటి హర్షారెడ్డిని తీసుకొని వచ్చారు.

వారితో మాకు పరిచయం లేదు. మేం ఎవరినీ పిలువలేదు. అప్పుడు రోడ్డు కోసం భూమి ఇస్తే బాగుంటుందని అడిగారు. ఇక్కడ 111 జీవో ప్రొహిబిషన్ ఉంది. మాకు ఈ భూములను ఇచ్చే ఉద్దేశం లేదు. ఒకవేళ ప్రభుత్వం చేస్తే చూద్దామనుకున్నాం. అప్పుడు ప్రభుత్వ అనుమతే లేదు. ఎందుకని తప్పుడు డీల్ చేయడం ఎందుకని వారు అడినప్పుడు ఏం చెప్పలేదు’. 

పొంగులేటి వచ్చారు..

‘వారం తర్వాత హర్షారెడ్డి ఆయన తండ్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీసుకుని మా ఇంటికి వచ్చారు. కేవలం పరిచయం కోసం వచ్చారనుకున్నాం. కానీ వాళ్లు భయపెట్టేందుకే వచ్చారని తర్వాత తెలిసింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వచ్చినప్పుడు ఇష్యూస్ ఏం కాలేదు. మూడోసారి హర్షారెడ్డి మా ఇంటికి వచ్చారు. న్యూ జెన్స్ డెవలపర్స్‌కు రెండు మూడు ఎకరాలు అడిగారు. తర్వాత మొత్తం భూములు ఇవ్వ మని అడిగారు. ఎట్టి పరిస్థితుల్లో మా భూ ములు ఇవ్వబోమని తేల్చి చెప్పాం. అది ఆయనకు నచ్చలేదు.

ఆ తర్వాత అక్టోబర్‌లో మా చుట్టుపక్కల భూములన్నీ మాకు తెలియకుండానే సర్వే చేశారని తెలిసింది. రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు అడిగితే రెక్కీ చేస్తున్నామని చెప్పారు. ఈ భూముల కోసం ముందుగానే నవీన్ మిట్టల్, పొంగులేటి హర్షారెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ మీటింగ్ పెట్టుకున్నారని మాకు తెలిసింది. పేరు చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. అధికారం ఉన్న దగ్గర నుంచి ప్రభావితం చేశారు. అక్టోబర్ 4 తేదీన లెటర్ ఇచ్చాం.

2019, 2021లో హైకోర్టు ఆదేశాల మేరకు కూడా సర్వే జరిగిందని, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, రంగారెడ్డి కలెక్టర్, తహశీల్దార్, ఆర్డీవో కూడా పార్టీగా ఉన్నారు. కానీ వాటిని వారు పట్టించుకోలేదు. ట్రంపెట్ రోడ్డు కోసం హెచ్‌ఎండీఏ భూసేకరణ జరిగింది. దాన్ని చూడలేదు. సర్వేలన్నీ తప్పులున్నాయని, హెచ్‌ఎండీఏ అవుటర్ రింగ్ రోడ్డు తప్పులున్నాయని మౌఖికం చెప్పారు. లిఖితపూర్వ కంగా ఏం ఇవ్వలేదు. నేను సర్వే చేస్తానని శ్రీనివాసులు వెళ్లి పోయారు.

ఇప్పుడు మనం కూర్చున్న భూములు, గోశాల కూడా కూడా మార్క్ చేశారు. సర్వే నోటీసులివ్వకుండా ఎందుకు మార్క్ చేశారని మాకు అనుమానం వచ్చింది. వెంటనే నేను లెటర్ ఇచ్చాను. మాకు నోటీసు ఇవ్వకుండా పంచనామా చేస్తున్నారని చెప్పాను. నోటీసులు అన్నీ 258, 259, 260 సర్వే నెంబర్‌లో ఉన్న వారికి నోటీసులు ఇచ్చా రు. కానీ ఆ భూములన్నీ నాలా కన్వర్షన్ అయింది. వ్యవసాయ భూముల్లో మా త్రమే సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులకు అధికారం ఉంటుంది.

కానీ నాలా భూముల్లో సర్వే చేసేందుకు అధికారం ఉం డదు. అప్పుడు నేను అభ్యంతరం చెప్పినా ఆయన మా మాట వినలేదు. అయితే నోటీసు ఇవ్వకుండానే పంచనామా చేస్తున్నారని అంతకుముందే నేను హైకోర్టును ఆశ్రయించాను. అప్పుడు కోర్టు ఆ సర్వే నోటీసును సస్పెండ్ చేసింది. అయినా ఆ అధికారి పంచనామా ఇష్యూ చేశారు. హౌకోర్టు ఆదేశాలిచ్చిన ముందు రోజు డేట్ వేసి పంచనామా ఇచ్చారు. నేను మళ్లీ కోర్టు కు వెళ్తే పంచనామాను కూడా సస్పెండ్ చేసింది.

ఇంకా కోర్టులోనే పెండింగ్‌లో ఉంది. ఆ తర్వాత అక్టోబర్ 30వ తేదీ రాత్రి మేం ఇంట్లో ఉన్నప్పుడు మా భూమి దగ్గరకు ఆరు, ఏడు జేసీబీలు వచ్చాయని, గోడ అంతా కూలగొడుతున్నారని, మా స్టాఫ్‌ను కొడుతున్నారని సమాచారం వచ్చింది. వాళ్లు ఇలా భయపెడతారని మాకు ఐడి యా లేదు. తెల్లావారిన తర్వాత మా సిబ్బం ది అన్ని జేసీబీలు నెంబర్ ప్లేట్ లేకుండా వచ్చాయని చెప్పారు. ఇదంతా పోలీసులకు తెలుసు. జేసీబీలను పోలీసులు సీజ్ కూడా చేసి ఉండొచ్చు.

ఈ జేసీబీలు తెచ్చింది, స్టాఫ్‌ను కొట్టింది రాఘవా కన్‌స్ట్రక్షన్స్ వాళ్లే అని మా స్టాఫ్ చెప్పారు. నేను పోలీసులకు కంప్లుంట్ చేశాను. ఎఫ్‌ఐఆర్ కూడా అయిపోయింది. ఈ భూములన్నీ మా ఆధ్వ ర్యంలో ఉన్నాయని, మమ్మల్ని అనుభవించనివ్వాలని లోయర్ కోర్టు నుంచి ఇంటె రిమ్ ఇంజెక్షన్ కూడా తీసుకొచ్చాను. రెం డోసారి దాడి చేసే సమయానికి పోలీసులు వచ్చారు. వారు వచ్చారు కాబట్టి బతికిపోయాం. మొత్తం ఐదుసార్లు చేశారు.

ఇక్క డ కడీలు, జాలిలు పెట్టి ఆక్రమించాలని వాళ్ల ఆలోచన ఉంది. మా స్టాఫ్‌లో ముగ్గు రు, నలుగురిని చేతులు కట్టేసి కొట్టారు. సెల్‌ఫోన్ సీజ్ చేశారు. నేను, నా భార్య, కూతురు వచ్చి చూసే వరకు ఇక్కడ అంత గలాటా జరుగుతుంది. పవర్ కట్ చేశారు. దాదాపు 70 మంది జేసీబీలతో వచ్చారు. పదిసార్లు ఫోన్ చేస్తే గచ్చిబౌలి పోలీసులు వచ్చారు. అప్పటికైనా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. వారు వచ్చి మాకు చాలా సహాయం చేశారు.

లేకపోతే వారు మమ్మ ల్ని చంపి ఇక్కడే పాతిపెడతామని దాడి చేసిన వాళ్లు బెదిరించారు. అందరూ మా స్క్‌లో ఉన్నారు. ఒకరిద్దరు మాత్రమే రోజూ కనిపించే వాళ్లు ఉన్నారు. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్ అయింది. వెహికిల్స్ అన్ని సీజ్ అయ్యా యి. ఆ రోజు వచ్చిన గుండాలను పోలీసుల తీసుకెళ్లారు. అయినా నేను మళ్లీ ఎఫ్‌ఐఆర్ చేశాం. ఆ తర్వాత కూడా మాపై వేధింపులు కొనసాగాయి. అప్పుడు మళ్లీ హైకోర్టుకు వెళ్లాను. దాంతో జస్టిస్ మౌసమీ భట్టాచార్య మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని రెండు ఆదేశాలిచ్చింది.

ఇప్పటికీ ఆ ఆదేశాలున్నా యి. మేం పోలీసులను ఆశ్రయిస్తే ఈ కేసు పెండింగ్‌లో ఉందని, ఈ భూమిలో మీరు ఏం చేయొద్దని చెబుతున్నారు. మేం ఈ భూమిని అనుభవించడానికి కోర్టు ఆదేశాలున్నా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పో లీసులపై కూడా పైనుంచి ఒత్తిడి ఉందని మాకు అనుమానం ఉంది. వాళ్లు కూలగొట్టిన వాటిని రిపేర్ చేస్తే మా స్టాఫ్‌ను పోలీ సు స్టేషన్ తీసుకెళ్లారు. తర్వాత వాళ్ల మనుషుల వచ్చి మేం రిపేర్ చేసిన దాన్ని మళ్లీ కూలగొట్టారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి.

కోర్టు ఆదేశాలు న్నా కూడా లా అండ్ ఆర్డర్ ఏం చేయలేని పరిస్థితి ఉంది. ముందు రాఘవా కన్‌స్ట్రక్షన్స్ అన్నారు. అసలు దీని వెనుక ఎవరు న్నారని తెలుసుకుంటే న్యూ జెన్ డెవలపర్స్ ఉన్నారని తెలిసింది. అప్పుడు ఒక డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ దొరికింది. అందులో ఏముందంటే న్యూ జెన్ డెవలపర్స్‌లో మేనేజింగ్ పార్ట్‌నర్స్‌లో గాదె లక్ష్మీ సిద్ధార్థరెడ్డి, పొంగులేటి హర్షారెడ్డి, పొంగులేటి స్వప్నారెడ్డి, పొంగులేటి లోహిత్‌రెడ్డి ఉన్నా రు. ఆ తర్వాత మా భూములను నాలా కన్వర్ట్ చేశారు.

అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్లకు ఫేవర్ చేసేందుకు అవుటర్ రోడ్డు కింద 8 ఎకరాలు పోతే 9 ఎకరాలుగా, 9 ఎకరాలు పోతే 10 ఎకరాలుగా పెంచారు. మేం పరిశీలిస్తే మా భూముల్లో 7 ఎకరాలు ప్లాన్ ప్రకారం ఆక్రమించారు. మా భూములు ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పడంతో ఇదంతా చేశారు. గతంలో మా భూముల్లో డిస్ప్యూట్ ఉందని ఎప్పుడు చెప్పలేదు. కానీ 2025 నుంచి మా భూముల్లో రోడ్డు పెంచుతున్నామని ఆక్రమించారు.

ఈ విషయంలో ముందు పోలీసుల మాకు సహక రించారు. కానీ తర్వాత వారు ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. ఆ రోజు రాత్రి గోడలు కూల్చి తర్వాత మరుసటి రోజు మా పక్క సర్వే నెంబర్ వాడు హార్షారెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేశాడు. మా గోడను ఎందుకు కూల్చారని హర్షారెడ్డిని అడిగాను. మీరు కోర్టుకు పోయినా మీకు ఎవరు ఏం చేయరని అనే ఉద్దేశంలో మాట్లాడారు. పోలీ సులు కూడా వారిని ఆపలేకపోతున్నారు. 

భయభ్రాంతులకు గురి చేస్తున్నారు: పల్లవి షా, బాధితురాలు 

దీపావళి నుంచి మేము చాలా భ యంతో బతుకుతున్నాం. మా ఇంటికి వచ్చి భయబ్రాంతులకు గురిచేస్తున్నా రు. 2021లో మేము భూమి సర్వే చేసుకొని వాల్ కట్టుకున్నాం. కొంతమంది వచ్చి 244లో మీకు భూమి ఇస్తాం. అక్కడ తీసుకోవాలని హర్షారెడ్డి మనుషులు వచ్చి చెప్పారు. తర్వాత డెవలప్ మెంట్ కోసం ఇవ్వమని చెప్పారు. మేము వేరే వాళ్ల భూముల్లోకి ఎందుకు వెళ్తామని, మా భూమిలోనే ఉంటామని చెప్పాం. మేం ఎక్కడికి వెళ్లమని తేల్చి చెప్పాం.

మా భూమి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్తే మాపై ఒత్తిడి చేశారు. ఇవ్వకుంటే గుండాలతో భయపట్టించారు. మా గోడలను తొలగించారు. 70 మంది గూండాలు జేసీబీలతో మా సిబ్బందిని కొట్టారు. పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. మాకు భూమి ఇవ్వకుంటే ఇక్క డే సజీవంగా పాతి పెడతామని బెదిరించారు. మేం అర్థరాత్రి 1 గంటలకు వచ్చి ఉదయం 7 గంటలకు మా భూమి దగ్గ ర నిలబడి ఉన్నాం.

గచ్చిబౌలి పోలీస్ హబీబ్ ఉల్లా ఖాన్ మాకు న్యాయం చేశారు. కానీ మరుసటి రోజే హబీబ్ ఉల్లా ఖాన్‌ను ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేశారు. మా గోశాలను తొలగించడంతో మా ఆవులు రోడ్డు పైకి వెళ్ళాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. హై కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా వీళ్లు దాడులు చేస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఎలా బతుకుతారు.