16 May, 2026 | 2:11 AM

బండి సంజయ్ తల్లికి గుండెపోటు

16-05-2026 12:37 AM

స్టంటు వేసిన వైద్యులు

కరీంనగర్, మే 15 (విజయక్రాంతి): కేం ద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించి, గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు.. శకుంతలకు గుండెకు స్టంట్ వేసి, అత్యవసర చికిత్స అందిస్తున్నారు. బండి సంజయ్ మెడికవర్ ఆసుపత్రికి చేరుకుని తల్లిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు.