రోడ్డుపై మక్కలు పోసి రైతుల ధర్నా
16-05-2026 12:36 AM
పెద్దకొత్తపల్లి, మే 15: నాగర్‌కర్నూల్ జి ల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని బ స్టాండ్ చౌరస్తా వద్ద 167 జాతీయ రహదారిపై రైతులు శుక్రవారం ధర్నా నిర్వహిం చారు. ధాన్యం, మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మొక్కజొ న్న ధాన్యాన్ని రోడ్డుపై పారబోసి ధర్నా చేపట్టారు. తహసీల్దార్ శ్రీనివాసులు ధర్నా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అనం తరం జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.






