కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా బండి శ్రీనివాస్
వెంకటాపూర్, జూలై 2 (విజయక్రాంతి): మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బండి శ్రీనివాస్ ను నియమించినట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ప్రకటించారు. ఈ నియామకం రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క సూచనల మేరకు ఈ నియామకం జరిగినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా బండి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన తనకు ఇప్పుడు మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పట్ల పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నియమ నిబంధనలను పాటిస్తూ, పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ అవకాశం కల్పించిన మంత్రి సీతక్క, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డితో పాటు జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.






