3 July, 2026 | 12:56 AM

కాంగ్రెస్ విజయోత్సవ సభకు పోటెత్తిన జనం

03-07-2026 12:15 AM

ఆమనగల్లు నుంచి భారీగా తరలిన శ్రేణులు

ఆమనగల్లు, జూలై 2 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయోత్సవ సభకు జనం భారీగా తరలివెళ్లారు. ఆమనగల్మున్సిపాలిటీతో పాటు కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్, మాడుగుల మండలాల్లోని అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.సభకు వెళ్లే వారి కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు.

అంతకుముందు ఆమనగల్లు పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం కల్వకుర్తికి బయలుదేరిన వాహనాలను  మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, పార్టీ మండల అధ్యక్షులు జగన్ లు జెండా ఊపి ప్రారంభించారు.

కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, బిచ్య నాయక్, సర్పంచులు కర్ణాకర్ గౌడ్, మహేందర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు మంగ్లీ రాములు, శంకర్,పట్టణ అధ్యక్షుడు మానయ్య, కో-ఆప్షన్ సభ్యుడు ఖాదర్, మార్కెట్ డైరెక్టర్లు సంపత్ కుమార్,రమేష్ రవి,పార్టీ నాయకులు బొజ్జ సాయిరెడ్డి, కాలే మల్లయ్య, కృష్ణ నాయక్, మాజీ ఎంపీపీ అనిత విజయ్,  తదితరులు పాల్గొన్నారు.