calender_icon.png 5 July, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విడతలవారీగా బ్యాంకు లింకేజీ రుణాలు

05-07-2025 12:00:00 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (విజయక్రాంతి):  అర్హత కలిగిన ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలని జీహెఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలో స్వయం సహాయక సంఘాల ప్రగతిపై జీహెఎంసీ పరిధిలోని 30 సర్కిళ్ల ప్రాజెక్ట్ ఆఫీసర్లతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

విడతలవారీగా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణ సదుపాయం కల్పించాలని తెలిపారు. ఆత్మ నిర్భరత కోసం జీహెఎంసీ పరిధిలోని మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు క్యాటరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, స్ట్రీట్ వెండర్ కలెక్టివ్‌లు, ఈవెం ట్ మేనేజ్‌మెంట్, మీ సేవా సెంటర్లు, మహిళ శక్తి కాంటీన్లు వంటి విభాగాల్లో శిక్షణ, ఆర్థిక సాయంపై దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రతి సర్కిల్‌లో కమ్యూనిటీ హాల్‌ను షెల్టర్ హోమ్‌గా ఏర్పాటు చేసి, నిరాశ్రయులను ఎన్జీవోల సహకారంతో పునరా వాసం చేయాలన్నారు.  సమావేశంలో అడిషనల్ కమిషనర్ పంకజ,ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఎం. దేవేందర్ రెడ్డి, పి.సురేష్ కుమార్ పాల్గొన్నారు.

సమన్వయంతో పనిచేయాలి

సీజనల్ వ్యాధుల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ ఆర్‌వి కర్ణన్  ఆదే శించారు. శుక్రవారం సీజనల్ వ్యాధులపై జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన వివి ధ శాఖాధిపతులకు కీలక సూచనలు చేశారు. దోమల కాటు ద్వారా వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

మహిళా స్వయం సహాయక బృందాల సహకారంతో డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి అంటువ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు వారంలో మూడుసార్లు అంటువ్యాధులపై పూర్తి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో జాయింట్ డైరెక్టర్, ఉస్మానియా యూనివర్శిటీ ఎంటమాలజీ ప్రొఫెసర్ జి. వెంకటేశ్వర్ రావు, మలేరియా డిప్యూటీ డైరెక్టర్ వెంకటేష్, ఇ.ఇ.సి.టి లక్ష్మీనారాయణ రాజు,

అడిషనల్ కమిషనర్  ప్రసాద్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజ మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఎంటమాలజీ సిబ్బందికి తగిన సూచనలు చేశా రు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్లు, డిప్యూటీ కమీషనర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, మేడ్చల్ జిల్లా మలేరియా సిబ్బంది, సీనియర్ ఎంటమాలజిస్టులు తదితరులు పాల్గొన్నారు.