04-07-2025 11:59:08 PM
కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ
వెంకటాపురం నూగూరు,(విజయక్రాంతి): నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల స్కూల్ లో ఉన్న ఆడపిల్లలకు పరిశుభ్రత, ఆరోగ్యం పట్ల జాగ్రత్తల గురించి అవగాహన సదస్సు కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జ్యోతి హాజరై మాట్లాడారు. ఆడపిల్లలు నెలసరిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రంగా ఉండాలని, మంచి ఆహారాన్ని తీసుకోవాలని తెలియజేశారు. హాస్టల్లో ఉన్నప్పుడు పరిశుభ్రమైన బట్టలు వేసుకోవాలని,మీ చుట్టూ ఉన్న పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఆడపిల్లలు 21 సంవత్సరాలు దాటాకే పెళ్లి చేసుకోవాలని తెలియజేశారు. 21 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలియచేశారు. మంచిగా చదువుకుని ఉద్యోగం చేసి మీ కుటుంబానికి ఆర్థికంగా అభివృద్ధి చేసుకోండి అని తెలియ చేశారు. ఈ కార్యక్రమానికి కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ వెంకటాపురం కోఆర్డినేటర్ హనుమంతు, వాజేడు మండల కోఆర్డినేటర్ కామేష్ యనిమేటర్స్ భాస్కర్,ప్రశాంత్, నరేష్,ఉష ,పద్మ ఇందిరా,ఏఎన్ఎస్ యాకమ్మ, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.