30 June, 2026 | 7:17 PM

గృహ రుణం తీసుకుంటున్నారా?

26-05-2024 12:35 AM

మీరు గృహ రుణం కోసం దరఖాస్తు చేసేముందు కీలక అంశాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రుణం మీ సొంత ఇంటి కోసం కనుక.  మీరు తీసుకున్న రుణం చెల్లింపు పూర్తయ్యేంతవరకూ మీరు ఎంతమేరకు కట్టుబడి ఉండాలో ఆ అంశాలే నిర్దేశిస్తాయి. ఇంటి కొనుగోలు కోసం బ్యాంక్‌లు ఏ తరహా రుణాలిస్తాయి. ఆ రుణంపై వడ్డీ రేటు ఎంత? ఏ బ్యాంక్ తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది? అంతేకాదు రుణానికి దరఖాస్తు చేసేటపుడు వడ్డీ చెల్లింపులు, ప్రాసెసింగ్ వ్యయాలు, అడ్మినిస్ట్రేటివ్  ఛార్జీలు, ప్రీపేమెంట్ పెనాల్టీలు తదితర వివరాలన్నింటినీ తెలుసుకోండి.  అప్పుడు మీరు తీసుకునే రుణానికి ఎంత వ్యయం అవుతుందన్న అవగాహన ఏర్పడుతుంది. 

వివిధ రకాల రుణాలు

కొన్ని బ్యాంక్‌లు ఫ్లోటింగ్ రేటు రుణాలిస్తాయి. ఈ తరహా రుణానికి వడ్డీ రేటు ఆయా బ్యాంక్ బెంచ్ మార్క్ రేటుతో లింక్ అయి ఉంటుంది. బెంచ్‌మార్క్ రేటు మారినపుడల్లా మీరు తీసుకున్న రుణంపై వడ్డీ రేటు సైతం మారుతుంది. బెంచ్‌మార్క్ రేటు తగ్గితే రుణ వడ్డీ రేటు తగ్గడం, బెంచ్‌మార్క్ రేటు పెరిగితే రుణ వడ్డీ రేటు పెరగడం జరుగుతుంది. అదే ఫిక్స్‌డ్‌రేటుపై తీసుకునే గృహ రుణం అయితే రుణ కాల పరిమితి అంతా అదే వడ్డీ రేటు వర్తిస్తుంది. హైబ్రీడ్ రుణాల్లోనైతే వడ్డీ రేటు ఫిక్స్‌డ్, ఫ్లోటింగ్ రేటు  రుణాలు కలిసి ఉంటాయి. ఆయా రకాల రుణాల సానుకూల, ప్రతికూల అంశాలను బేరీజు వేసుకుని, మీ భవిష్యత్ ఆదాయానికి, చెల్లింపు సామర్థ్యానికి తగిన రుణాన్ని తొలుత మీరు ఎంపిక చేసుకోవాలి.

అంతేకాకుండా బ్యాంక్‌లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీలు)  ఇచ్చే గృహ రుణాలపై వడ్డీ రేట్లు వేరువేరుగా ఉంటాయి. అందుచేత అన్ని బ్యాంక్‌లు ఆఫర్ చేసే వడ్డీ రేట్లు ఎంతో తెలుసుకోండి. సరైన బ్యాంక్‌ను ఎంచుకోండి. అంతేకాదు దరఖాస్తు చేసేముందు వడ్డీ రేట్ల వివరాల్ని బ్యాంక్‌తో చెక్ చేసుకోండి.  చాలావరకూ మీ ఆదాయం, చెల్లింపు సామ ర్థ్యం ఆధారంగా గృహ రుణానికి అర్హత, రుణం పరిమాణాన్ని బ్యాంక్ నిర్దేశిస్తుంది.  రుణం పంపిణీ చేసిన తేదీన అమలులో ఉన్న వడ్డీ రేటే మీ గృహ రుణంపై వర్తిస్తుంది. ఈ అంశాలు అన్నింటిని పరిగణలోకి తీసు కోని ఏ బ్యాంకులో / హెచ్‌ఎఫ్‌సీలో గృహ రుణం తీసుకోవాలో నిర్ణయించుకోండి.

రూ.30 లక్షల వరకూ గృహ రుణంపై బ్యాంక్‌ల వడ్డీ రేట్లు

(2024 మే 15నాటి రేట్లు)

బ్యాంక్/హెచ్‌ఎఫ్‌సీ                     వడ్డీ రేటు శాతం

ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా                    8.50

బ్యాంక్ ఆఫ్ బరోడా                                     9.15

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా            8.35

పంజాబ్ నేషనల్ బ్యాంక్                            8.45

బ్యాంక్ ఆఫ్ ఇండియా                            8.40

కెనరా బ్యాంక్                                           8.50

యూకో బ్యాంక్                                           8.45

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర                           8.35

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్                   8.40

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా           8.45

ప్రైవేటు రంగ బ్యాంక్‌లు

ఐసీఐసీఐ బ్యాంక్                                  8.75 నుంచి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్                          8.75 నుంచి

కొటక్ మహీంద్రా బ్యాంక్                          8.70 నుంచి

యాక్సిస్ బ్యాంక్                                  8.75

కరూర్ వైశ్యాబ్యాంక్                                  8.70

కర్నాటక బ్యాంక్                                  8.50

ఫెడరల్ బ్యాంక్                                 8.80 నుంచి

బంధన్ బ్యాంక్                                 9.16

ఆర్బీఎల్ బ్యాంక్                                 8.90 నుంచి

సిటీ యూనియన్ బ్యాంక్                        8.25

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్                8.50

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్                8.50 నుంచి

టాటా క్యాపిటల్                                8.75 నుంచి

పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్                8.50

జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్                        8.80 నుంచి

ఆదిత్యా బిర్లా క్యాపిటల్                        8.60 నుంచి

ఐసీఐసీఐ హోం ఫైనాన్స్                 9.20 నుంచి

గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్                 8.55 నుంచి