30 June, 2026 | 6:14 PM

చక్కెర తగ్గించండి..!

27-05-2024 12:05 AM

చిన్నపిల్లలు పంచదారను, పంచదారతో చేసిన పదార్థాలను ఎక్కువగా ఇష్టపడతారు. వాటిని ఎక్కువగా తినడానికి మక్కువ చూపిస్తుంటారు. అయితే చిన్న పిల్లలకు చక్కెర పదార్థాలు ఇవ్వడం వల్ల వారి ఆరోగ్యానికి మంచిది కాదని, చక్కెర, కొవ్వు పదార్థాలను పిల్లలు తినడం వల్ల అనేక సమ స్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలకు ఎంత త్వరగా చక్కెర ఇస్తే అంత త్వరగా స్వీట్లను ఇష్టపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బాల్యంలో చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల గుండె జబ్బు లు, ఊబకాయం, అధిక రక్తపోటుకు దారి తీస్తుంది. కాబట్టి మూడు లేదా రెండు సంవత్సరాల వయసులోపు పిల్లల ఆహారంలో చక్కెరను ఇవ్వవద్దని వైద్యులు అంటున్నారు.

పిల్లల ఆహారంలో మార్పు

చక్కెర లేని ఆహార పదార్థాలను కనుగొనడం చాలా కష్టంగా మారింది. ఆరోగ్యకరమైనదిగా అనుకునే గోధు మ రొట్టె లాంటి ఆహార పదార్థాలలో కూడా చక్కెర ఉంటుంది. చక్కెర కలిపి న ఆహార పదార్థాలు, పానీయాలకు దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. స్వీట్ డ్రింక్స్ కాకుండా పిల్లలు సాధారణ పాలు తాగాలి. జ్యూస్‌లను కాకుం డా అరటిపండ్లు, మామిడి పండ్లు తినిపించడం మంచిది.