30 June, 2026 | 8:30 PM

Breaking News

క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •   రమాదేవి సేవలు చిరస్మరణీయం   •   జమలాపురం శ్రీవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు   •  

బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే..

26-05-2024 12:21 AM

70 శాతం వరకూ రాబడి ఇచ్చిన స్కీమ్స్

ఆర్థిక సంవత్సరం ముగిసిన సందర్భంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు వారి పెట్టుబడులపై లాభాలు ఏ మేరకు వచ్చాయో చూసుకోవడం సహజం. 2023 ఆర్థిక సంవత్సరంలో స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో మదుపుచేసినవారు అధిక రాబడుల్ని ఆర్జించారు. బ్లూచిప్ షేర్లు కూడా తక్కువేమీ పెరగలేదు. 2023 నిఫ్టీ సూచి 30 శాతం ర్యాలీ జరిపింది. ఈ ప్రధాన సూచీ పనితీరుతో పోల్చిచూస్తే, అంతకుమించి అధిక లాభాల్ని ఇచ్చిన స్కీమ్స్ చూద్దామా!

పీఎస్‌యూ థీమ్స్‌తో భారీ లాభాలు

గత ఏడాదికాలంగా ప్రభుత్వ రంగ కంపెనీలు స్టాక్ మార్కెట్లో అద్భుతమైన ర్యాలీని నిర్వహించాయి. పీఎస్‌యూల లాభాల వృద్ధి మెరుగ్గా ఉండటం, అవి కార్యకలాపాలు నిర్వహించే రంగాల పనితీరు బాగుండటంతో పీఎస్‌యూ షేర్ల రీరేటంగ్ జరిగిందని ఆదిత్యాబిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ మహేశ్ పాటిల్ తెలిపారు. అయితే ఇప్పుడు చాలావరకూ పీఎస్‌యూల విలువలు అబౌ ఏవరేజ్ స్థాయికి చేరాయని, రక్షణ, రైల్వేలు, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లోని ప్రభుత్వ కంపెనీల షేర్లయితే విలువల్లో హయ్యర్ ఎండ్ రేంజ్‌లో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో నాలుగు పీఎస్‌యూ థీమ్ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ ఏడాదికాలంలో 100 శాతానికి పైగా రాబడుల్ని ఇచ్చాయి. అవి.. 

సీపీఎస్‌ఈ ఈటీఎఫ్:

1. ఈ విభాగంలో ఇది టాపర్. గత ఏడాదికాలంలో 121.18 శాతం పెరిగింది.

2. ఎస్‌బీఐ పీఎస్‌యూ ఫండ్ ఏడాదిలో 107.66 శాతం రాబడుల్ని అందించింది.

3. ఇన్వెస్కో ఇండియా పీఎస్‌యూ ఈక్విటీ ఫండ్, ఆదిత్యా బిర్లా ఎస్‌ఎల్ పీఎస్‌యూ ఈక్విటీ ఫండ్‌లు 104.42 శాతం, 100.17 శాతం చొప్పున లాభాల్ని తెచ్చిపెట్టాయి.

4. ఐసీఐసీఐ ప్రు పీఎస్‌యూ ఈక్విటీ ఫండ్ నికర ఆస్తుల విలువ (ఎన్‌ఏవీ) 88.49 శాతం పెరిగింది. 

5. గత మూడేండ్లలో పీఎస్‌యూ థీమ్ ఫండ్స్ సగటున 44.61 శాతం రాబడిని అందించగా, సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ 54.80 శాతం పెరిగింది. 

6. గత ఐదేండ్లలో పీఎస్‌యూ థీమ్ ఫండ్స్ సగటున 28.04 శాతం లాభాల్ని ఇచ్చాయి. వాటిలో ఇన్వెస్కో ఇండియా పీఎస్‌యూ ఈక్విటీ ఫండ్ ఎన్‌ఏవీ 30.30 శాతం పెరిగింది. సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ 27.88 శాతం, ఎస్‌బీఐ పీఎస్‌యూ ఫండ్ 25.92 శాతం చొప్పున రాబడుల్ని అందించాయి.

మిడ్‌క్యాప్ ఫండ్స్

సెబీ ఆదేశాల ప్రకారం ఈ ఫండ్స్ వాటి పెట్టుబడి నిధుల్లో కనీసం 65 శాతం మిడ్‌క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్ విలువలో 101 నుంచి 249 వరకూ ర్యాంకుల్లో ఉన్న కంపెనీలను మిడ్‌క్యాప్ స్టాక్స్‌గా వ్యవహరిస్తారు.

మిడ్‌క్యాప్ ఫండ్స్                             వార్షిక రాబడి శాతం

క్వాంట్ మిడ్‌క్యాప్ ఫండ్                               65.66

 ఐటీఐ మిడ్‌క్యాప్ ఫండ్                               62.70

మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్      60.37

మహింద్రా మనులైఫ్ మిడ్‌క్యాప్ ఫండ్          59.61

హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్ ఫండ్                      57.23

జేఎం మిడ్‌క్యాప్ ఫండ్                             56.98

స్మాల్ క్యాప్ ఫండ్స్

ముగిసిన ఆర్థిక సంవత్సరంలో స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలనే తీసుకొచ్చాయి. స్మాల్ క్యాప్ స్కీమ్స్ వాటి మొత్తం ఆస్తుల్లో కనీసం 65 శాతం స్మాల్‌క్యాప్ షేర్లలో పెట్టుబడి చేస్తాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 250 ర్యాంక్ కంటే దిగువన ఉన్న కంపెనీలనే స్మాల్‌క్యాప్ స్టాక్స్‌గా వ్యవహరిస్తారు.

స్మాల్‌క్యాప్ ఫండ్స్                     వార్షిక రాబడి శాతం

బంధన్ స్మాల్‌క్యాప్ ఫండ్                        69.54

క్వాంట్ స్మాల్‌క్యాప్ ఫండ్                                66.51

మహింద్రా మనులైఫ్ స్మాల్‌క్యాప్ ఫండ్         65.84

 ఐటీఐ స్మాల్‌క్యాప్ ఫండ్                                  62.71

ఇన్వెస్కో స్మాల్‌క్యాప్ ఫండ్                          53.24

ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్         52.90

ఈ టేబుల్‌లో స్మాల్ క్యాప్ ఫండ్స్‌ను పరిశీలిస్తే బంధన్ స్మాల్‌క్యాప్ ఫండ్ గత ఏడాదికా లంలో అత్యధికంగా 69 శాతం లాభాన్ని తెచ్చిపెట్టింది. మరో మూడు స్కీములు 60 శాతంపైగా రాబడుల్ని ఇచ్చాయి.

లార్జ్‌క్యాప్ ఫండ్స్

లార్జ్‌క్యాప్ ఫండ్స్ వాటి ఆస్తుల్లో కనీసం 80 శాతం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనే పెట్టుబడి చేయాలి. మార్కెట్ విలువలో టాప్ 100 కంపెనీలను లార్జ్‌క్యాప్స్‌గా వ్యవహరిస్తారు. 

లార్జ్‌క్యాప్ ఫండ్స్                                    వార్షిక రాబడి శాతం

క్వాంట్ లార్జ్‌క్యాప్ ఫండ్                                         52.38

బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్లూచిప్ ఫండ్                 48.74

జేఎం లార్జ్‌క్యాప్ ఫండ్                                         45.42

నిప్పన్ ఇండియా లార్జ్‌క్యాప్ ఫండ్                          44.82

తౌరస్ లార్జ్‌క్యాప్ ఫండ్                                          44.04

2023 లో ఉన్నతమైన పనితీరు కనపర్చిన లార్జ్‌క్యాప్ ఫండ్స్ 40 శాతంపైగా రాబడులు ఇచ్చాయి. ఒక్క స్కీమ్ మాత్రం అందించిన లాభం మాత్రం 50 శాతాన్ని మించింది.

ఇన్వెస్టర్లకు సూచన

గతంలో ఆయా మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చిన రాబడులు భవిష్యత్ లాభాలకు గ్యారంటీ కాదన్న సంగతిని ఇన్వెస్టర్లు గుర్తించాలి. మరోమాటలో చెప్పాలంటే 2023 ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు కనపర్చిన స్కీమ్స్ భవిష్యత్‌లోనూ అదే తరహాలో రాబడులు ఇస్తాయని భావించడం సబబు కాదు.