14 August, 2026 | 10:07 PM

Breaking News

చిట్యాలలో టీటీడీ కల్యాణ మండపం భూమిపై సమగ్ర విచారణ జరిపించాలి   •   విద్యుత్ ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు ఘన నివాళి   •   విద్యార్థులు కళావేదికను సద్వినియోగం చేసుకొని ఉన్నతులుగా ఎదగాలి   •   విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి   •   బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్   •   ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.. పొంగులేటి సైన్యం ఊరుకోదు   •   పశువుల దొంగలు అరెస్టు   •   శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం   •   మోస్రా వెళ్లే ప్రయాణికులకు తప్పని తిప్పలు   •   సీఎస్ సంజయ్ జాజు పలు అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్   •  

జిల్లా పద్మశాలి సర్వసభ్య సమావేశానికి తరలివెళ్లిన బాన్సువాడ పద్మశాలీలు

15-06-2026 12:28 AM

బాన్సువాడ, జూన్ 14 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈఎస్‌ఆర్ పంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన జిల్లా పద్మశాలి సంఘం సర్వసభ్య సమావేశం (మనోహరం)కు బాన్సువాడ డివిజన్ లోని పద్మశాలి సంఘం సభ్యులు బారీ సంఖ్యలో వాహనాల్లో తరలివెళ్లారు.

అదేవిధంగా జిల్లా సమావేశంలో సంఘం బలోపేతం, సంఘ సభ్యుల ఐక్యత, సంఘ సభ్యుల సంక్షేమం, పేద విద్యార్థుల సంక్షేమం, పేద కుటుంబాలకు అండగా ఉండడం, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం వంటి అంశాలు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇటీవల జిల్లాలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, సర్పంచులు, ఉపసర్పంచ్లు, కౌన్సిలర్లు,వార్డు సభ్యులు, ఇతరత్రా చైర్మన్ పదవుల్లో ఉన్న పద్మశాలి కుల సంఘం సభ్యులను ఘనంగా శాలువ, మేమంటో లతో సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,గూడ శ్రీనివాస్, చందుపట్ల నారాయణ రామచందర్ నరహరి బాలకృష్ణ బాలరాజ్ లక్క శ్రీనివాస్ సుంకి శ్రీను,కౌన్సిలర్లు జంగం రాజు మహేష్ శ్రీకాంత్ హోటల్ సాయిలు, గంగారం, పండరి, జంగం శ్రీను, అందె రాజు,సాదు సాయిలు, బీoరాజ్, జీవన్, యోగేష్, శ్రీధర్, రమణ,ఆంజనేయులు,గాజుల శ్రీనివాస్,రాజు,అనిల్ సంఘం సభ్యులు ఉన్నారు.