సీఎం వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి
- పాఠశాలల మూసివేత విద్యాహక్కులకు విఘాతం
- పాఠశాలల మూసివేస్తే డ్రాప్‌ఔట్ పెరిగి విద్యకు దూరం
- ప్రైవేట్ విద్యా సంస్థలకు లాభం చేకూర్చే ప్రయత్నం
- నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భారీ ఉద్యమం
- బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ.ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠ శాలలను 4 వేలకు తగ్గించి, 23 వేల పాఠశాలలను మూసివేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పా ఠశాలల మూసివేత పేద, దళిత, గిరిజన విద్యార్థుల విద్యా హక్కులకు విఘాతం కలిగిస్తుందని అన్నారు.
రాష్ట్రంలో విద్యారం గాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకపోవడంతో పాటు 30 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పాఠశాలల మూసివేత వల్ల డ్రాప్‌ఔట్ రేటు పెరిగి పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సింది పోయి వాటిని నిర్వీర్యం చేసి ప్రైవేట్ విద్యా సంస్థలకు లాభం చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
ఎన్నో పోరాట ఫలితాల వల్ల పాఠశాలలు నెలకొల్పారని గుర్తు చేశారు. కార్పొరేట్ స్కూల్లకు న్యాయం చేసేందుకే పాఠశాలల రద్దు యోచన అని, ఆలోచన మానకుంటే రాష్ట్రంలో యుద్ధమే కొనసాగుతుందని హెచ్చరించారు. విద్య, వైద్యం ద్వారానే సమాజ మార్పు అని, విద్యారంగాన్ని నిర్వీరం చేస్తే సహించేది లేదన్నారు. జూలై 1 నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలను రాష్ట్ర వ్యాప్తంగా తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ యువజన సంఘం రాష్ట్ర అధ్య క్షుడు జిల్లా పల్లి అంజి, విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోడీ రాందేవ్, రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు జి. అనంతయ్య, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి. రాజేందర్, డా. కప్పుల అన్వేష్, పరిపూర్ణ చారి, డాక్టర్ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.






