6 June, 2026 | 11:52 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

జోగు రామన్న పార్టీ మారుతారేమో?

09-04-2026 12:00 AM

కాంగ్రెస్‌లో చేరేందుకే సీఎంపై లేనిపోని ఆరోపణలు?

కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి గోవర్దన్ రెడ్డి

ఆదిలాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): మాజీ మంత్రి జోగు రామన్న ఎప్పుడు పార్టీ మారాలనుకున్న ఈ పార్టీలో చేరతారో అదే పార్టీపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. గతంలో సైతం టీడీపీ నుండి టీఆర్‌ఎస్‌లో చేరే సమయంలో కేసీఆర్‌పై లేనిపోని ఆరోపణలు చేసి, మళ్లీ టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సం గతినీ గుర్తు చేశారు. ఇప్పుడు సైతం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే సీఎం రేవంత్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారెమో అని అనుమానం వ్యక్తం అవుతోందన్నారు.

బుధవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మాజీ మంత్రి జోగు రామన్న లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఆయన చేసిన ఆరోపణాల్లో ఎలాంటి పస లేదని అన్నారు. 2013లో అప్ప టి కలెక్టర్ అహ్మద్‌బాబు ఆధ్వర్యంలో ఎయిర్ పోర్టు కోసం 1500 ఎకరాల స్థలాన్ని గుర్తించ డం జరిగిందని గుర్తు చేశారు. అప్పుడు మం త్రిగా ఉన్న జోగు రామన్న, ఎంపీగా ఉన్న నగేష్‌లు సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి ఎయిర్ పోర్టు ఏర్పాటుకు ఒప్పించలేకపోయారని ఎద్దే వా చేశారు. 

2018 ఫిబ్రవరిలో సీఎం హోదా లో చనక -కోరటకు వచ్చిన కేసీఆర్ భూ నిర్వాసితులకు ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని,  కానీ మంత్రిగా ఉన్న జోగు రామ న్న ఏ ఒక్క ఇంటినైనా కట్టించారా అని ప్రశ్నించారు.  9 సంవత్సరాల్లో చనక కోరట ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని, తమ కాంగ్రె స్ ప్రభుత్వం వచ్చకే భూ నిర్వాసితుల కోసం నిధులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు.

2014లో కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటతో రూ.1100 కోట్ల నిధులతో మైనార్టీ స్కూల్‌ల నిర్మాణ పనులు ప్రారంభించగా ఇందులో రూ.600 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించినది నిజం కదా అని ప్రశ్నించా రు. తాను చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి రామన్న శ్వేత పత్రాన్ని విడుదల చేయడంతో పాటు సీఎంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు సుధాకర్ గౌడ్, సంజయ్, బీడీ చారి తదితరులు పాల్గొన్నారు.