9 April, 2026 | 2:45 AM

పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

09-04-2026 12:00 AM

ఆదిలాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్య వంతులు అవుతారని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుప త్రి నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు నిర్వహించిన వాకథాన్ (ర్యాలీ)ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పలువురికి ఫుడ్ లైసెన్స్‌లను అందజేశారు. అదేవిధంగా వివిధ రకాల ఫుడ్ స్టాల్ లను పరిశీలించారు.

అనంతరం జడ్పీ సమావేశ మం దిరంలో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రస్తుత కాలంలో తీసుకునే ఆహారంలో రసాయనాల వాడకల ఎక్కు వైందని, వాటి వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆహారం, నిద్ర సరైన సమయానికి తీసుకోవాలన్నారు. ‘సరైన ఆహారం తీసుకుందాం - ఆరోగ్యంగా ఉందాం‘ అనే నినాదంతో ప్రజలు తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆహార భద్రత అధికారి ప్రత్యూష, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ నాయక్, వైద్యులు దీపక్ పుష్కర్, నరేందర్ పాల్గొన్నారు.