సోలార్ వెలుగులతో భద్రతకు భరోసా
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
వాహనాల వేగం గుర్తించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు
హైదరాబాద్ టూ నాగ్‌పూర్ వరకు ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్
ఉట్నూర్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవతో ప్రమాదాలు జరి గే స్థలంలో సోలార్ విద్యుత్ వెలుగులను ఏ ర్పాటు చేశారు. నిత్యం రాత్రి వేళల్లో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని కలెక్టర్ రాజర్శి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ గుర్తించారు. దీంతో ప్రమాదాలను అరికట్టాలని అధికారులు నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా అధికారులు ముందు చూపుతో ఎక్కువగా ప్రమాదాలు జరిగే గుడిహత్నూర్ నుండి సీతాగొంది, మేకల గండి ప్రాంతంలో రాత్రి వేళలో విద్యుత్ వెలుగులు విరజల్లె విధంగా సోలార్ విద్యుత్ వెలుగులను ఏర్పాటు చేశారు.
సోలార్ విద్యుత్ వెలుగులో రాత్రి సమయంలో సైతం రెండు కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణించే వాహనాల వేగా న్ని, ప్రమాదాలను పసిగట్టే విధంగా సీతాగొంది గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశా రు. జిల్లా ఉన్నత అధికారులు నిర్ణయం తీసుకొని సోలార్ విద్యుత్ వెలుగులు, సీసీ కెమెరా లు ఏర్పాటు చేయడంతో జాతీయ రహదారిపై ప్రయాణం చేసే వాహన చోదకులతో పాటు నిత్యం ప్రయాణం చేసే ప్రయాణం ప్రయాణికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐతే జిల్లాలోని జాతీయ రహదారి పై జరిగే తరుచు ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి, అక్కడ సైతం సోలార్ విద్యుత్ వెలుగులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.




