27 February, 2026 | 2:44 AM

బస్తీ దవాఖానకు సుస్తీ అయిందా?

27-02-2026 12:35 AM

నిరూపయోగంగా బస్తీ దవాఖాన 

లక్షలు వెచ్చించి కట్టి వదిలేసిన వైనం

ప్రారంభించక ముందే పతనమవుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు

అయిజ ఫిబ్రవరి 26: అయిజలోని ఎస్సీ కాలనీలో నాలుగో వార్డ్ నందు బస్తీ దావఖాన నిర్మించి రెండేళ్లు పూర్తయిన ఇంతవర కు ప్రారంభించకపోవడం శోచనీయమని ప్ర జలు విచారం వ్యక్తం చేస్తున్నారు. పట్టణాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సదుద్దేశంతో నిర్మించే బస్తీ దవఖానల ప్రభుత్వ నిర్ణయం మంచిదైనప్పటికీ ప్రజల సేవకు నోచుకోకపోతే లక్షల వెచ్చించి నిర్మించిన ఉపయోగముండదని కాలనీవాసులు అనుకుంటున్నారు.

అయిజలోని ఎస్సీ కాలనీ లోనాలుగు వార్డులు కలిపి సుమారు ఇంచుమించు పదివేల జనాభా కలిగిన ప్రాంతమ ని అట్టి జనాభా కలిగిన ప్రదేశానికి బస్తి దవఖాన నిర్మించడం సముచితమే అయినప్పటికీ ప్రారంభానికి కూడా నోచుకోకపోవడం దురదృష్టకరమని ప్రజలు చర్చించుకుంటున్నారు రేక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ద ళితులది. అనారోగ్యం పాలైనవారు, ముసలివారు సుమారు మూడు కిలోమీటర్ల దూ రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే లోకల్ ఆటో వాళ్ళు 40 లేదా 50 రూపాయలు అడిగితే ఇవ్వలేని పరిస్థితి.

ప్రతి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ప్రవేట్ ఆసుపత్రిలో దోపిడీకి తట్టుకోలేక ఇటు దూరాన ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లలేక ఎస్సీ కా లనీ వాసులు రోగాలతో సతమతమవుతున్నామని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశా రు. ఆర్థిక స్తోమత లేని దళితులను దృష్టిలో ఉంచుకొనిజిల్లా స్థాయి అధికారులు డి ఏం హెచ్ ఓ మరియు కలెక్టర్ గారు లైన తక్షణమే స్పందించి ఎస్సీ కాలనీలోని నాలుగో వార్డ్ యందు నిర్మించిన బస్తీ దవకాలను త్వ రలో ప్రారంభించి మా సమస్యను పరిష్కరించాల్సిందిఅంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అయిజ ప్రాథమిక ఆసుపత్రి కేంద్రం 

అయిజ మండల జనాభాను దృష్టిలో ఉంచుకొని అధికారులు అదనపు భవనాన్ని నిర్మించి అసంపూర్ణoగా వదిలివేశారని, ఆ భవనం దగ్గరలోని కాలనీ వాసులకు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిం దని ప్రజల్లో చర్చకు దారి తీసింది.

రక్షణ, కాపుదల లేక భవనం నాశనమవుతుందని ఇలా ప్రజాదానం వృధా కావడమే గాక ప్రజాసేవ అందకపోవడం కూడా ఒకింత లోపమేనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న నిధుల వరకు భవాన నిర్మా ణం చేసి కాంట్రాక్టర్ తప్పుకున్నాడని అందువల్ల ఆ భవనం అసంపూర్తిగా ఉన్నదని విని కిడి. ఆ భవనం ప్రారంభించక ముందే శిథిలా వ్యవస్థకు చేరుకుందని ప్రజలు అనుకుంటున్నారు.

ప్రభుత్వాలు విద్య ఆరోగ్యం పై దృష్టి సారించాలి : రాజరత్నం బియస్పి 

ప్రభుత్వాలు ప్రచారాలకు ఇచ్చిన హంగు ఆర్భాటాలు ప్రజల ఆరోగ్యాలపై చూపడం లేదని ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకు కావలసిన ఆరోగ్యం విద్యలపై పెట్టుబడులు పెడితే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి వైపు నడుస్తాయి. ప్రభు త్వాలు విద్య ఆరోగ్యం పై దృష్టి సారించాలని అన్నారు.