27 February, 2026 | 4:24 AM

అన్నీ ఉన్నా.. ప్రారంభించేందుకు సమయం ఎందుకు?

27-02-2026 12:37 AM

నిధులు ఖర్చు చేసి సదుపాయాల కల్పన 

కార్పొరేషన్‌లో దిక్కు తోచని స్థితిలో అనాధలు 

స్వచ్ఛంద సంస్థకు బాధ్యతలు.. ప్రారంభించడంలో నిర్లక్ష్యం 

పలుమార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదంటున్న జిల్లా జనరల్ హాస్పిటల్ సూపర్ టెండెంట్ రంగా అజ్మీర 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): అనాధలకు ఆశ్రయం కల్పించాలని సంకల్పంతో జిల్లా ఉన్నత అధికారులు జనరల్ హాస్పిటల్ నందు ప్రత్యేక భవనంతో పాటు అవసరమైన సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచారు. నిర్వహణ బాధ్యత సైతం ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించి సమర్థవంతంగా అనాధలను అక్కున చేర్చుకొని వారికి అవసరమైన సదుపాయాలను అందిస్తూ ముందుకు సాగాలని సూచనలు సైతం చేశారు.

ఎందుకు జనరల్ హాస్పిటల్ పండు నుంచి కొంత మొత్తం ఖర్చు చేసి బెడ్లను సైతం ఏర్పాటు చేశారు. అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ సత్యం సంస్థ నిర్వాహకులు మాత్రం బాధ్యతలు తీసుకొని ప్రారంభించేందుకు ముందుకు రావడం లేదు. ఈ విషయంపై సంబంధిత అధికారులు సంప్రదింపులు చేసినప్పటికీ అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెళ్ళదిస్తున్నారని ప్రారంభించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకుంటే అనాధలకు కొంత వెసులుబాటు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

ఫోన్ చేసిన స్పందించడం లేదు..

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వచ్ఛంద సంస్థకు అనాధ ఆశ్రమం నిర్వహణ భద్రత అప్పగించడం జరిగింది. వారిని సంప్రదించి ఆ భవనాన్ని ప్రారంభించి అనాధలకు ఆశ్రయం కల్పించాలని చెబుతున్నప్పటికీ అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు తప్ప ప్రారంభించడం లేదు. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోతాం. తదుపరి చర్యలు ఏం తీసుకోలేన విషయంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనాధలకు ప్రత్యేక ఆశ్రయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటం. ఎల్లప్పుడు ఐదు నుంచి పదిమంది అనాధలకు వైద్య సేవలు అందిస్తూనే ఉంటాం. వారి ఆరోగ్యం మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.

 రంగా అజ్మీర, జిల్లా జనరల్ హాస్పిటల్ సూపరి టెండెంట్, మహబూబ్ నగర్