30-09-2025 12:42:33 AM
నల్గొండ క్రైమ్ సెప్టెంబర్ 29: సంస్కృతి సంప్రదాయాలకు పత్రిక బతుకమ్మ పండుగని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలతో అనేక రకాల పకృతి పూలతోబతుకమ్మ పండుగ నిర్వహించుకుంటారని ఇది మహిళల్లో మరింత ఐక్యతను స్నేహభావాన్ని పెంపొందిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.
అడిషనల్ ఎస్పి మౌనిక మహిళలతో కలిసి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని పోలీస్ కుటుంబ సభ్యుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్బీ డీఎస్పీ మల్లారెడ్డి, సిఐలు రాము,మహా లక్ష్మయ్య,రఘువీర్ రెడ్డి, ఆర్.ఐలు సంతోష్, శ్రీను,సూరపు నాయుడు,హరిబాబు, మహిళా యస్.ఐలు శ్రావణి,మౌనిక, విజయ బాయి తదితరులు పాల్గొన్నారు