calender_icon.png 30 September, 2025 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే..

30-09-2025 12:41:11 AM

ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ 

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 29 : రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 24 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత మా కాంగ్రెస్ పార్టీదని ఎమ్మెల్సీ, నల్లగొండ డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో  బిఆర్‌ఎస్ అలియాస్ టిఆర్‌ఎస్ బాకీ  వడ్డీ కార్డు విడుదల చేసి మాట్లాడారు.

బిఆర్‌ఎస్ పార్టీ  ఎస్సీలకు మూడెకరాలు,రైతులకు రుణమాఫీ ఐదు సంవత్సరాల వడ్డీ, నిరుద్యోగులకు 3000, డబుల్ బెడ్ రూమ్ బాకీ కార్డులు ఉన్నాయని మండిపడ్డారు. మాజీ మంత్రి  జగదీశ్వర్ రెడ్డిని గొల్లగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే అడ్మిట్ చేయాలని, తమ ప్రభుత్వం అధికారం పోయి సోయి లేకుండా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. తిప్పర్తిలో బిఆర్‌ఎస్   ఆరు గ్యారెంటీ లపై విడుదల చేసిన కార్డుపై నల్లగొండ సెంటర్లో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదని హెచ్చరించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ అభివృద్ధి పథంలో ముందుకు ఉధృతంగా కొనసాగుతుందని తెలిపారు.అన్ని ప్రాజెక్టులను పెండింగ్ పెట్టిన ఘనత మీ కెసిఆర్ దని ఆరోపించారు.కాలేశ్వరం పేరు మీద లక్షల కోట్లు దోచుకున్నది వాస్తవమ్మ కాదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర బిఆర్‌ఎస్ పార్టీదనిమీరు ధర్నా చౌకులు ఎత్తేస్తే తిరిగి మేమే ధర్నా చౌక్ ఏర్పాటు చేశామని తెలిపారు.

నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉన్నదని ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెస్ పార్టీ పనితనాన్ని నల్లగొండ ప్రజలు మెచ్చుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ ముందుకెళ్తుందని కొన్ని గ్యారెంటీలు అమలు కాకపోవటం టిఆర్‌ఎస్ చేసిన అప్పులే ముఖ్య కారణమని తెలిపారు.రేపు జరగబోయే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు. ఈ సమావేశంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు మామిడి కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.