21 July, 2026 | 7:30 PM

Breaking News

జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •   ఇల్లందు–బొమ్మనపల్లి ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత   •  

జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబురాలు

25-09-2025 01:00 AM

మహదేవపూర్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో జాతీయ సేవా దినోత్సవం రోజును పురస్కరించుకొని బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ నరసయ్య మాట్లాడుతూ భారతదేశంలోనే పూలను పూజించే పండుగ మన తెలంగాణ సంస్కృతిలో ఉన్నదని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరని, మన సంస్కృతిని సంప్రదాయాలను కొనసాగిస్తూ ఆడపిల్లలు బతుకమ్మ సంబరాలు ఘనంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.

జాతీయ సేవా పథకం రోజున పురస్కరించుకొని మా కోసం కాదు మీకోసం అనే నినాదంతో ఈ సేవా భావంతో కార్యక్రమాలు చేయాల్సిందిగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత మానవ సేవా దృక్పథం అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అబ్దుల్ గని, ప్రసాద్, సమ్మయ్య, సదశివ్, సదానందం, సంధ్య, శ్రీనివాస్, మహేష్, సనత్ కుమార్, కర్ణ, ప్రకాష్, మహేందర్, శ్వేతా, రమాదేవి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.