calender_icon.png 25 September, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ

25-09-2025 01:00:00 AM

  1. గిడ్డంగుల సంస్థ సామర్థ్యం మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల పెంపుకు చర్యలు

సంవత్సర కాలంలో కోల్ స్టోరేజ్ నిర్మాణం పూర్తి చేస్తాం

ఖమ్మం రూరల్ మండలం యం. వెంకటాయపాలెంలో శీతల గోదాముల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

ఖమ్మం, సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి): రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.మంత్రి, బుధవారం ఖమ్మం రూరల్ మండలం యం. వెంకటాయపాలెం గ్రామంలో 15 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 9 వేల 700 మెట్రిక్ టన్నుల శీతల గోదాముల నిర్మాణానికి జిల్లా కలెక్టర్, సిపి లతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 10 సంవత్సరాల కాలంలో గత పాలకులు గిడ్డంగుల సామర్థ్యం 3 లక్షల మెట్రిక్ టన్నుల పెంచితే, మన ప్రజా ప్రభు త్వం 5 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణ పనులు చేపట్టిందని, రాబో యే 3 సంవత్సరాలలో వీటిని పూర్తి చేస్తామ ని అన్నారు.

గిడ్డంగుల సంస్థ ద్వారా గతంలో ఎన్నడు లేని విధంగా మొట్టమొదటిసారిగా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా కోల్ స్టోరేజ్ ని ర్మాణానికి శ్రీకారం చుట్టామని, 9700 మె ట్రిక్ టన్నుల సామర్థ్యంతో కోల్ స్టోరేజ్ ను 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని, సంవత్సర కాలంలో కోల్ స్టోరేజ్ నిర్మాణం పూర్తి చేసి, వాణిజ్య పంటలు పండించే రైతన్నలకు ప్రైవేటు కంటే అతి చౌకగా కోల్ స్టో రేజ్ అందుబాటు లోకి తీసుకుని వస్తామని అన్నారు.

రైతు భరోసా కింద పెట్టుబడి సహా యం ఎకరానికి 12 వేల రూపాయలకు పెంచడం జరిగిందని, 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయలు రైతుల రు ణమాఫీ పూర్తి చేసామని, సన్న వడ్లకు మ ద్దతు ధరతో పాటు 500 రూపాయల బో నస్ అందించామని అన్నారు.రైతులను రా జు చేయడమే లక్ష్యంగా నాణ్యమైన విత్తనా లు పంపిణీ చేస్తున్నా మని అన్నారు.

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు మాట్లాడుతూ స్థానిక రైతులకు ఉపయోగపడే విధంగా కార్పోరేషన్ చరిత్రలో మొట్టమొదటి సారిగా కోల్ స్టోరేజ్ ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, దీనిని రైతులు పూర్తి స్థాయిలో ఉపయోగించు కోవాలని అన్నారు. మంత్రి సూచనల మేరకు రాష్ట్రంలో మరో 5 లక్షల టన్నుల గోదాములు నిర్మించి గిడ్డంగుల సంస్థ సామర్థ్యం 10 లక్షల టన్నులకు పెంచేందుకు కృషి చేస్తున్నామని,

ఇప్పటికే మూడు లక్షల టన్నుల గోదాములు నిర్మాణానికి అవసరమైన స్థల కేటాయింపు జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండి కొర్ర లక్ష్మీ, ఆర్ అండ్ బి ఎస్‌ఇ యాకోబు, ఖ మ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, పీఆర్ ఇఇ మహేష్ బాబు, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, వివిధ శాఖల అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.