calender_icon.png 25 September, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.1612 కోట్లు చెల్లింపు

25-09-2025 01:01:19 AM

హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ వెల్లడి 

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భా గంగా లబ్ధిదారులకు ఇప్పటీ వరకు రూ. 1612.37 కోట్లు విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్  వి.పి.గౌతం తెలిపారు. ఈ వారంలోనే (24 సెప్టెంబర్  నాటికి) రికార్డు స్థాయిలో 17 వేల ఇండ్లకు గాను రూ.188.35 కోట్లను విడుదల చేశామన్నారు.

రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 2.12 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం కాగా, ఇప్పటీ వరకు 1.50 లక్షకు పైగా ఇళ్లకు చెల్లింపులు చేసినట్లు బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటి నిర్మాణపు పనుల దశలను బట్టి విడతల వారీగా మొత్తం రూ. 5 లక్షల చొప్పున లబ్ధిదారుల  ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని తెలిపారు.