calender_icon.png 28 September, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ పండుగ మహిళలకు అతిపెద్ద పండుగ: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

27-09-2025 11:48:00 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): మహిళలకు అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖల మహిళా ఉద్యోగులు బతుకమ్మ పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా అదనపై ఎస్పీ చైతన్య రెడ్డిలతో కలిసి మహిళలతో బతుకమ్మ ఉత్సవాన్ని నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటేనే మహిళలకు ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతుందన్నారు. బతుకమ్మ పండుగ ఆడడానికి వెళ్లలే ఎంతో ఉత్సాహాన్ని చూపి ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకుంటారని అన్నారు.

కలెక్టరేట్లో బతుకమ్మ ఉత్సవాల నిర్వహించడంతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ప్రభుత్వ మహిళా ఉద్యోగులు సంతోషంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నారని తెలిపారు. బతుకమ్మ పండుగ మహిళా సోదరీమణులకు అతిపెద్ద పండుగ అని  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ న్నారు. గురువారం కలెక్టరేట్లో మహిళా,శిశు సంక్షేమ శాఖ, ఎక్సైజ్  శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ  జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్  జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిలతో కలిసి  మహిళలతో బతుకమ్మ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... బతుకమ్మ పండుగ అంటేనే మహిళలకు ఒక ప్రత్యేక అనుభూతి అని  అన్నారు. బతుకమ్మ పండుగ మహిళలకు అన్ని పండుగలలో పెద్ద పండుగ అని, బతుకమ్మ పండుగ ఆడడానికి మహిళలు ఎంతో ఉత్సాహాన్ని చూపి ఎంతో సంతోషంగా, ఆనందంగా  జరుపుకుంటారని అన్నారు. జిల్లాలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలనే ప్రభుత్వ సూచనల మేరకు ప్రతిరోజు కలెక్టరేట్లో బతుకమ్మ ఉత్సవాల నిర్వహించడంతోపాటు  జిల్లా వ్యాప్తంగా  ప్రతిరోజు వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ప్రభుత్వ మహిళ ఉద్యోగులు  సంతోషంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నారని తెలిపారు.