23 June, 2026 | 10:50 AM

Breaking News

ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కార్ బడికి సర్పంచ్ కూతురు   •   ముదిరాజ్ సంఘ మాజీ అధ్యక్షుడు వంతడుపుల అలియాస్ గొడుగు నర్సయ్య మృతి   •   ఆధారాలు ఉంటే చూపించండి.. మేము లెక్కలు చూపించడానికి సిద్ధం   •   విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం   •   తెలుగే కదా పండితుడు ఎందుకు అనుకుంటున్నారా?   •   కామారెడ్డిలో బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్   •   ప్రభుత్వ ఇసుక రీచ్‌పై దాడి.. సైట్ ఇంచార్జీపై దౌర్జన్యం   •   కోరం కనకయ్య వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో కూడినవి: హరిప్రియ నాయక్   •   వ్యభిచారానికి అడ్డు చెప్పిన గ్రామస్తులపై కత్తితో దాడి   •   గాలివాన బీభత్సం: ఎర్రగడ్డలో కుటుంబం వీధి పాలు   •  

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్

17-09-2025 12:00 AM

తెలంగాణలోని సృజనాత్మకత కలిగిన యువతలోని ప్రతిభను వెలికి తీసేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్ డీసీ) సరికొత్త పోటీలు నిర్వహించనుంది. ’బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్’ పేరిట ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఫిల్మ్ ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు వివరించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై లఘుచిత్రాలు (షార్ట్ ఫిలిమ్స్), పాటల పోటీలు ఉంటాయి.

అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలుచేస్తున్న మహిళలకు ఉచిత బస్సు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోరట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి పలు అభివృద్ది, సంక్షేమం కార్యకమాలపై చిత్రీకరించిన లఘుచిత్రాలు, ప్రత్యేక గీతాలను పోటీలో అనుమతిస్తారు. పోటీలకు సంబంధించిన అర్హతలను ఎఫ్ డీసీ నిర్ణయించింది. షార్ట్ ఫిలిమ్స్ నిడివి 3 నిమిషాలకు, పాటల వ్యవధి 5 నిమిషాలకు మించి ఉండకూడదు.

ఈ పోటీలో పాల్గొనే వారందరూ 40 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. పోటీకి పంపే ఫైల్స్ 4కే రిజల్యూషన్ కలిగి ఉండాలి. షార్ట్ ఫిల్మ్స్, వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీలో సూచించిన థీమ్ లపైనే ఉండాలి. పోటీకి పంపిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ కోసమే చిత్రీకరించినవై ఉండాలి.

పోటీల్లో ఎంపికైన థీమ్స్‌కు ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.2 లక్షలు, తృతీయ బహుమతి రూ.లక్ష, కన్సోలేషన్ బహుమతి రూ.20 వేలు (అయిదుగురికి) ఇవ్వడంతో పాటు విజేతలందరికీ ప్రశంసా పత్రం, జ్ఞాపిక ప్రదానం చేస్తారు. నిర్దేశిత గడువులోగా వచ్చిన ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి వివిధ కేటగిరీల్లో ఎంపికలు పూర్తి చేస్తుంది. ఎంట్రీలను ఈ కింది మెయిల్ ఐడీ youngfilmmakerschallenge@gmail.comకి లేదా వాట్సాప్ నెంబర్: 8125834009 కు పంపాలి. ఎంట్రీలను పంపించేందుకు సెప్టెంబరు 30వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు.