calender_icon.png 17 September, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుసు కదా ముగించారు

17-09-2025 12:00:00 AM

మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ’తెలుసు కదా’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో  శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. టీమ్ లోకేషన్ లో కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. అక్టోబర్ 17న విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.