22 June, 2026 | 10:20 PM

హరిహర వీరమల్లు యుద్ధం

17-08-2024 01:52 AM

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అనివార్య కారణాల వల్ల కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న చిత్రబృందం ఇప్పుడు వరుస అప్డేట్లు ఇస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టు 14న తిరిగి ప్రారంభించినట్టు తాజాగా తెలిపారు.

యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో ఒక భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణ ప్రారంభించినట్టు వెల్లడించారు. ఈ షూటింగ్‌లో సుమారు -500 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ సైతం తిరిగి ఈ ప్రాజెక్టులో మరికొద్ది రోజుల్లో పాల్గొంటారని మేకర్స్ తెలిపారు.