15 August, 2026 | 3:23 PM

జిల్లా కమిషనర్ రాజశేఖర్ రెడ్డికి ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రం

15-08-2026 02:48 PM

జనగామ, (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ సేవలందించినందుకు మున్సిపల్  కమిషనర్ రాజశేఖర్ రెడ్డికి ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి పనితీరును అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. పరిపాలనలో పారదర్శకత, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలులో చూపిన చొరవ కారణంగా ఈ గుర్తింపు లభించింది. ప్రజలకు సకాలంలో సేవలు అందించడంలో రాజశేఖర్ రెడ్డి కృషి అభినందనీయమని కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలిపారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ గుర్తింపు మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులోనూ జనగామ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని చెప్పారు.కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.