టెన్త్ ఫలితాలలో బీబీఎం ఘన విజయం
హైదరాబాద్, ఏప్రిల్ 29(విజయక్రాంతి): బుధవారం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో స్థానిక నా యుడుపేటలోని బీబీఎం పాఠశాల విద్యార్థులు 600 మార్కులకు గాను మేఘన 586, టీ శ్రీ చరిత 585, బి చరణ్ 579, ఆర్ ప్రియన్ 578, టి.జశ్వంత్ 573 , ఎం. కీర్తన 572 మార్కులు సాధించడమే కాక హాజరైన విద్యార్థులందరూ 70 శాతం పైగా మార్కులతో ఉత్తీర్ణత సాధిం చడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఐదుగురిలో నలుగురికి 500 పైగా మార్కులు సాధించారు.
ఈ అత్యుత్తమ ఫలితాలు సాధించిన పాఠశాల విద్యార్థినీ విద్యార్ధులకు, ఈ ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు, సహకరించిన తల్లిదండ్రులకు పాఠశాల డైరెక్టర్ గుర్రం కాంతరావు అభినందనలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జి. నా గమణి, ప్రిన్సిపాల్ ఆర్.గోపాల్ రావు, ఉపేందర్, మీరా, అజయ్ , పద్మశ్రీ, భారతి, సునంద, అనిత పాల్గొన్నారు.






