17-07-2025 01:54:36 AM
- రిజర్వేషన్ల పెంపు ఆర్డినెన్స్‌ను గవర్నర్ యధావిధిగా ఆమోదించాలి
- ఆగస్టు 7న గోవాలో జాతీయ ఓబీసీ మహాసభ
- ఓబీసీ జాతీయ మహాసభ పోస్టర్ ఆవిష్కరణలో జాజుల శ్రీనివాస్ గౌడ్
ఖైరతాబాద్, జూలై 16 (విజయ క్రాంతి) : బీసీ రిజర్వేషన్ల పెంపు పై బిజెపి, బిఆర్‌ఎస్ నేతలు ద్వంద వైఖరిని అనుసరిస్తూ తప్పు డు ప్రచారం చేస్తున్నారని బిజెపి పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
ఆగస్టు 7న గోవాలో జరిగే జాతీయ ఓబిసి మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం బీసీ కుల సంఘాల జేఏసీ అధ్యక్షుడు కుందారం గణేష్ చారి ఆధ్వర్యంలో ఓబిసి మహాసభ పోస్టర్ ఆవిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన, ఆర్డినెన్స్ తెచ్చిన కోర్టులలో నిలువదని గ్లోబల్ ప్రచారానికి తెగబడుతున్నారని ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని బిజెపి, బిఆర్‌ఎస్ నేతలకు విజ్ఞప్తి చేశారు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు , కేంద్రమంత్రి బండి సంజయ్ లు నిన్న బీసీ రిజర్వేషన్లపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, 42% బీసీ రిజర్వేషన్ల లోనే 10 శాతం ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని ఆరోపించ డన్నీ తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థి దశ నుండే రామచంద్ర రావు బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి అని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లను అసెంబ్లీలో బిల్లు ఆమోదించి గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించి మూడు నెలలు అవుతున్న కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ బిల్లు ఆమోదించకుండా బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు.
పైగా మత ప్రాతిపాదికన రిజరేేే్వషన్లు ఉంటే మేము ఆమోదం తెలుపుము అని తప్పించుకోవడం వారి దివాలా కోరుతనానికి నిదర్శనమని అన్నారు. రామచంద్రరావు విద్యార్థి రాజకీయాలలో ఉన్నప్పటినుంచే సామాజిక రిజర్వేషన్లు మండల కన్వెన్షన్ సిఫార్సులకు వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బండారు దత్తాత్రేయను హరియారా గవర్నర్ పదవి నుంచి తొలగిం చడం, నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలుపొందిన రాజాసింగ్ ను బిజెపి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవికి అగ్రకుల వ్యక్తిని ఎంపిక చేయడం బీజేపీ పారీ్టీ బీసీ వ్యతిరేక విధానాలు అవలంబించడం కాదా అని ప్రశ్నించారు.
టిఆర్‌ఎస్ పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ కి పంపించిన ఆర్డినెన్స్ ను యధావిధిగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.దేశంలో మొదటిసారి ఓబీసీ రిజర్వేషన్ల అమలు చేస్తున్నట్టు ప్రకటించిన గోవాలో ఆగస్టు 7న అఖిల భారత ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నామని దేశవ్యాప్తంగా ఓబీసీలు కలలు వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాసు ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మ, వీటి మల్లయ్య గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు,బీసీ సంఘాల నేతలు ఈడిగ శ్రీనివాస్ గౌడ్, కౌల్య జగనాదం, గూడూరు భాస్కర్, రాంప్రభూ, మాదేశి రాజేందర్, వెంకటేష్ గౌడ్, పాలకూరి కిరణ్, హరినాథ్, నాగరాజ్ గౌడ్, సంధ్యారాణి, శ్యామల, సుజాత, శ్రీదేవి,తదితరులు పాల్గొన్నారు.