17-07-2025 01:57:58 AM
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, జూలై 16(విజయక్రాంతి): పార్లమెంట్లో పాసైన మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోట కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. అప్పుడే బీసీ మహిళలకు రాజ్యాధికారం దక్కుతుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ మేరకు బుధవారం కాచిగూడలోని హోటల్ అభినందన్ గ్రాండ్స్ లో బీసీ మహిళ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రావణి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో బీసీ మహిళా సంఘం సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ మహిళా బిల్లులో బీసీ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే మహిళా బిల్లుకు సార్ధకత లేదన్నారు. ఇప్పటికే మహిళా బిల్లు రాజ్యసభలో, లోకసభ లో కూడా ఆమోదం పొందిందన్నారు. మహిళా బిల్లు గురించి గొంతులు చించుకొని మాట్లాడే రాజకీయ పార్టీల నాయకులు బీసీ మహిళల గురించి వారికి జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. బీసీలు అంటే ఇంత చిన్నచూపా అని మండిపడ్డారు.
బీసీ సబ్ కోటా గురించి అసెంబ్లీలో మొక్కుబడిగా తీర్మానం చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. జనాభాలో సగభాగం ఉన్న బీసీ మహిళలకు కోటా ఇవ్వకుండా మహిళల గురించి మాట్లాడడం అన్యాయం అన్నారు. ప్రధాని మోడీ మహిళల పక్షపాతి అని, అన్ని రంగాలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆలోచిస్తున్నారని అన్నారు.
బీసీ మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నేతలు కరుణ, సుధాకర్, గొరిగె మల్లేష్ యాదవ్, నందగోపాల్, జిల్ల పెళ్లి అంజి, పగిళ్ల సతీష్ కుమార్, ఉదయ్ నేత, పృధ్వి గౌడ్, శ్రీకాంత్ గౌడ్, కవిత, స్వామి గౌడ్, బాలయ్య, సాజీరా, రవి యాదవ్ తదితరులు