17-07-2025 01:59:56 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
ఎల్బీనగర్, జులై 16 : తెలంగాణలో న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం అమలు చేయాలని, న్యాయవాదుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్.రాం చందర్‌రావు (సీనియర్ న్యాయవాది, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ మాజీ సభ్యుడు) ఎన్నికైన సందర్భంగా మంగళవారం ఎల్బీనగర్ లోని జిల్లా కోర్టులో రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
న్యాయవాదులకు అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రభు త్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో చాలా మంది న్యాయవాదులపైన దాడులు చేశారన్నారు. భారతదేశంలో వివిధ రాష్ట్రా ల్లో న్యాయవాదులకు రక్షణ చట్టం అమల్లో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 55,000 మంది న్యాయవాదులు ఉన్నారని, వీరి కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో న్యాయవాదుల పోరాటం కీలకమన్నారు. న్యాయవాదులు రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించాలని, ఎంతో మంది న్యాయవాదులు రాజకీయ నాయకులుగా ఉన్నారని గుర్తు చేశారు. న్యాయవాదులపై సోషల్ రెస్పాన్సిబిలిటి ఉందన్నారు. వెల్ఫేర్ ఫండ్ లో భాగంగా న్యాయవాదుల కోసం బార్ అసోసియేషన్ కు రూ, 50 కోట్లతో కూడిన మాచింగ్ గ్రాంట్ నిధులు ఇవ్వాలని కోరారు.
న్యాయవాద వృత్తిలో అపార మైన అవకాశాలు ఉన్నాయని, ఇంజినీర్లు, ఇతర ఉన్నత విద్య చేసినవారు లాయర్లుగా గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలిపారు. న్యాయవాదుల నిరంతరం అధ్యయనం చేయాలని, సాంకేతిక అంశాలపై పట్టు సాధించాలని సూచించారు.
కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కార్తీక్ బాసెటి, జాయింట్ సెక్రటరీ విష్ణువర్ధన్రెడ్డి, లేడీ రిప్రజెంటేటివ్ అనసూయ, కోశాధికారి ప్రశాంత్ కర్ణం, లైబ్రరీ సెక్రటరీ వెంకటయ్య జక్కుల, స్పోరట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ స్వామి అంతటి, కార్యనిర్వాహక సభ్యులు జ్యోతి ధరావత్, భాగ్య న్యూన్, సునీత మండలాపురం తదితరులు పాల్గొన్నారు.