calender_icon.png 24 December, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రచయితలు ఐక్యం కావాలి

24-12-2025 02:09:15 AM

సంక్రాంతి సెలవుల్లో సభ

బీసీ రచయితల వేదిక మహాసభ కన్వీనర్: జూకంటి జగన్నాథం

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): బీసీ రచయితలు ఐక్యం కావాలని, సంక్రాంతి సెలవుల్లో నిర్వహించనున్న తెలంగాణ బీసీ రచయితల మహాసభను విజయ వంతం చేయాలని బీసీ రచయితల వేదిక మహాసభ కన్వీనర్ ---జూకంటి జగన్నాథం పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర, జాతీ య, ప్రాంతీయ పార్టీల్లో బీసీవాదం బలపడేలా, రిజర్వేషన్ల సాధనకు ప్రజా సమూ హాలలో శక్తివంతంగా వ్యాప్తి చెందేలా చేయడానికి బీసీ రచయితలు కార్యాచరణను రూపొందించుకోవలసి ఉన్నదన్నారు.

ఆయా జిల్లా ల్లోని రచయితలతో, కవులతో  విస్తృతస్థాయిలో చర్చించి, మహాసభ నిర్వహణకు నిర్ణయించినట్టు చెప్పారు. బీసీ రచయితల మహాసభ స్థలం, వేదిక, తేదీలు, సమావేశ వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. బీసీ  కవులు, రచయిత్రులు, రచయితలంతా తమ వివరాలను ఆయా ఉమ్మడి జిల్లాల కో కన్వీనర్ల  ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా తెలి యజే యాలని చెప్పారు. ---ఖమ్మం-సునంద వురిమళ్ల 9441815722, వరంగల్- బండారి రాజకుమార్ 8919556560, ఆదిలాబాద్ - ఉదారి నారాయణ 9441413 666, నిజామాబాద్- వడ్ల శంకర్ 94407 98954, హైదరాబాద్, రంగారెడ్డి-వెల్దండి శ్రీధర్ 9866977741, నల్లగొండ- బెల్లి యాద య్య 98483 92690, మహబూబ్‌నగర్-వనపట్ల సుబ్బయ్య 9492765358, భీంపల్లి శ్రీకాంత్ 9032844017, కరీంనగర్-మద్దికుంట లక్ష్మణ్ 9441677373, మెదక్-ప ర్కపల్లి యాదగిరి 92999 09516.