24-12-2025 02:09:32 AM
సికింద్రాబాద్/కంటోన్మెంట్ డిసెంబర్ 23 (విజయ క్రాంతి): నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణదారులు ఎవ రు అక్రమ నిర్మాణాలు చేపట్టకూ డదని సికింద్రాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు. తార్నాకలో జిహెచ్ ఎంసి నుంచి తీసుకున్న నిబంధనలను అతిక్రమించి సెట్‌బ్యాంక్ లేకుండా ఓ నిర్మాణ దారుడు నిర్మాణం చేపట్టాడు. ఫిర్యాదు అందుకున్న సికింద్రాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు సెట్ బ్యాక్ లేని అక్రమ నిర్మాణాన్ని సర్కిల్ జోనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కూల్చివేశారు.
నిబంధనలు అతిక్రమించి నిర్మాణదారులు ఎవరు నిర్మాణాలు చేపట్టకూడదని అలా కాదని నిర్మాణ అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారులుతెలిపారు. ఎవరైనా అక్రమ నిర్మా ణాలు చేపడుతున్నట్లు తెలిస్తే వెంటనే సికింద్రాబాద్‌లోని జిహెచ్‌ఎంసి కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు..ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు, చైన్‌మాన్‌లు సిబ్బం ది, టౌన్ ప్లానింగ్ ఏసీపీ పావని, చైన్ మెన్ లు వెంకట్, రాజు, న్యాక్ ఇంజినీర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.