24-12-2025 02:08:07 AM
సాగునీటిపై ప్రభుత్వం ఇచ్చే పీపీటీని స్వాగతిస్తున్నాం
అసెంబ్లీలో మా గొంతు నొక్కుతున్నారు
మీడియా చిట్‌చాట్‌లో మాజీమంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాం తి): మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ తర్వాత రేవంత్ సర్కార్ పూర్తిగా డిఫెన్స్‌లో పడిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 25 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమంత్రి రాత్రి 9:30 గంటలకు చిట్-చాట్ పెట్టి వివరణ ఇచ్చుకోవడం ఎప్పుడూ చూడలేదని, దీంతోపాటు అరడజను మంది మంత్రులు పోటీపడి ప్రెస్‌మీట్లు పెట్టారంటే అది కేసీఆర్ పవర్ అని అన్నారు.
అందాల పోటీలు, ఫుట్‌బాల్ షోకులు, గ్లోబల్ సమ్మిట్లు పేదవాడికి అన్నం పెడతాయా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి సచివాలయం అంటేనే భయం పట్టుకుందని, వాస్తు భయంతో సెక్రటేరియట్ మెట్లు ఎక్కడం లేదని, గేట్లు, తలుపులు మార్చినా భయం పోక కేవలం కమాండ్ కంట్రోల్ రూమ్‌కే పరిమితం అయ్యారని విమర్శించారు. మాజీమంత్రి హరీశ్‌రావు మంగళవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 4000 మందికి పైగా బీఆర్‌ఎస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలవడంతో రేవంత్‌రెడ్డికి ఓటమి భయం మొదలైందని, అందుకే కో ఆపరేటివ్ ఎన్నికలు పెట్టడం లేదన్నారు. ఓయూకు ఒంటరిగా వస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి.. వేలాది మంది పోలీసుల పహారాలో వెళ్లారన్నారు.
సాగునీటిపై ప్రభుత్వం ఇచ్చే పీపీటీని స్వాగతిస్తున్నామన్నారు. సీపీఐ, ఎంఐఎం, బీజేపీ కంటే తక్కువ సమయం తమకు ఇస్తూ మా గొంతు నొక్కుతున్నారని, మైకులు కట్ చేస్తున్నారని విమర్శించారు. ఇది ప్రభుత్వం కాదు.. ఒక కన్సల్టెన్సీ కంపెనీ.. ముంబై బ్రోకర్ల సలహాలతో నడుస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.
సాగునీటి ప్రాజెక్టుల పేరిట రూ.7,000 కోట్లను ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క పంచుకున్నారని, 20 శాతం కమీషన్ ఇచ్చిన వారికే బిల్లులు ఇస్తున్నారని ఆరోపించారు. ‘అసెంబ్లీ ముగియగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘నాకు నోటీసులు ఇస్తారట. ఈ సిట్ (ఎస్‌ఐటీ) ఒక పెద్ద జోక్’ అని చెప్పారు. రాష్ర్టంలో ఉన్న అనేక సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
సం. ఏపీ టీజీ మొత్తం ఏపీ వినియోగం టీజీ వినియోగం
వినియోగం వినియోగం (శాతాల్లో) (శాతాల్లో)
2014 529.330 227.743 757.073 69.91 30.09
2015 124.960 69.688 194.648 64.20 35.80
2016 182.512 152.386 334.898 54.50 45.50
2017 359.857 183.298 543.155 66.25 33.75
2018 504.476 207.298 711.774 70.87 29.13
2019 653.064 278.234 931.298 70.12 29.88
2020 618.935 253.234 872.169 70.96 29.04
2021 621.841 265.051 886.892 70.11 29.89
2022 637.996 273.300 911.296 70.00 30.00
2023 210.000 120.000 330.000 63.63 36.37
2024 718.000 286.000 1004.000 71.51 28.49
మొత్తం 4442.611 2030.232 6472.843 68.63 31.37
(పైపట్టిక ప్రకారం గత పదేళ్లలో 2024 సంవత్సరం తెలంగాణ తాత్కాలిక వాటా కంటే అతితక్కువ నీటిని వినియోగించుకున్నది)