20-01-2026 06:37:33 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన బీసీ యువజన సంఘం క్యాలెండర్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఎంపీ ఆర్. కృష్ణయ్య మంగళవారం హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ యువత ఐక్యంగా ముందుకు సాగుతూ సామాజిక, రాజకీయ, విద్యా రంగాల్లో మరింత చైతన్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు. బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ చేపడుతున్న కార్యక్రమాలు యువతలో అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన ప్రశంసించారు.క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం నాయకులు, కార్యకర్తలు, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొనారు.