22 May, 2026 | 1:01 AM

పాండ్యాకు బీసీసీఐ షాక్

22-05-2026 12:26 AM

ముంబై, మే 21: ముంబై కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు బీసీసీఐ షాకిచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో 10 జరిమానాగా విధించింది. అంతేకాదు అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చారు. మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు, జట్టు అధికారు కోసం ఉద్దేశించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ పాండ్యాకు ఈ జరిమా నా విధించారు.

కేకేఆర్ ఇన్నింగ్స్ 10 ఓవర్లో పాండ్యా లెవల్ 1 ఉల్లంఘనకు పాల్పడినట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. అతడు బౌలింగ్ చేసేందుకు వెళ్లే క్రమంలో బెయిల్స్‌ను పడగొట్టాడు. ఓ వైపు ఫీల్డర్లు క్యాచ్‌లు మిస్ చేయడం, మరో వైపు వరుస బౌండరీలు ఇవ్వడంతో తీ వ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఇలా చేశాడు. కాగా ఈ సీజన్‌లో నిరా శ పరిచిన ముంబై ప్లే ఆఫ్స్ రేస్ నుంచే ఎప్పుడో ఇంటిదారి పట్టింది.