టాప్-2పై సన్‌రైజర్స్ కన్ను
హోంగ్రౌండ్‌లో ఆర్‌సీబీతో మ్యాచ్
ఉప్పల్‌లో మళ్లీ పరుగుల వరదే
హైదరాబాద్, మే 21: ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటి వరకూ మూడు జట్లు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. మిగిలిన ఒక బెర్త్ కోసం గట్టిపోటీనే నెలకొంది. అదే సమయంలో టాప్ 2లో లీగ్ స్టేజ్‌ను ముగించేందుకు కూడా తీవ్రమైన పోటీనే ఉంది.
ఎందుకంటే టాప్ 2లో నిలిచిన జట్టుకు క్వాలిఫైయర్‌లో ఒక మ్యాచ్ ఓడినా మరో అవకాశం దక్కుతుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ 2పై కన్నేసింది. శుక్రవారం తన హోంగ్రౌండ్ ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సన్‌రైజర్స్ టాప్ 2లో నిలుస్తుంది. అటు ఆర్సీబీ గెలిచినా కూడా దాదా పు అంతే. దీంతో ఇరు జట్లు టాప్ 2లో ప్లేస్ దక్కించుకోవడమే లక్ష్యంగా తమ చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్దమయ్యాయి.
గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న సన్ రైజర్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్, ఇషాన్ కిషన్, క్లాసెన్ మంచి ఫామ్‌లో ఉండగా.. హెడ్, నితీశ్ రెడ్డి నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. అయితే హోంగ్రౌండ్‌లో వీరిద్దరూ కూడా చెలరేగిపోయే అవకా శముంది. బౌలింగ్‌లో కమిన్స్ తో పాటు పేసర్లు ప్రఫుల్ హింగే, ఎహసాన్ మలింగా, సాకిబ్ హొస్సేన్ అదరగొడుతున్నారు. స్పిన్ ఎటాక్ కంటే పేస్ ఎటాక్ అద్భుతంగా రాణిస్తోంది.
ఆర్సీబీపై గెలిస్తే టాప్ 2లో ప్లేస్ దక్కించుకోవడంతో పాటు ప్లే ఆఫ్స్‌కు ముందు కాన్ఫిడెన్స్ పెరుగుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన హోదాకు తగ్గట్టే ఈ సీజన్ లో సత్తా చాటుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న ఆర్సీబీ మరో విజయంతో లీగ్ స్టేజ్‌ను ఘనంగా ముగించాలని భావిస్తోంది. ముంబై, కోల్ కతా, పంజాబ్ జట్లపై హ్యాట్రిక్ విజయాలతో ప్రస్తుతం బెంగళూరు సూపర్ ఫామ్‌లో ఉంది.
బ్యాటింగ్‌లో కోహ్లీ, పడిక్కల్, పటిదార్‌తో పాటు వెంకటేశ్ అయ్యర్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా లాంటి హిట్టర్స్‌తో ఉన్న ఆర్సీబీని కట్టడి చేయడం సన్‌రైజర్స్‌కు అంత ఈజీ కాదు. అటు బౌలింగ్ లోనూ బెంగళూరు పటిష్టంగా ఉంది. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్, హ్యాజిల్ వుడ్ అదరగొడుతున్నారు. స్పిన్ విభాగంలో కృనాల్ పాండ్యా, సుయా శ్ శర్మ కీలకంగా ఉన్నారు. గత రికార్డుల ప్రకారం చూస్తే సన్‌రైజర్స్ దే పైచేయిగా ఉంది. ఇక ఉప్పల్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కే అనుకూలంగా ఉంటుంది.
తుది జట్ల అంచనా
సన్‌రైజర్స్ : అభిషేక్, ఇషాన్ కిషన్, క్లాసెన్, సలీల్ అరోరా, నితీశ్ రెడ్డి, స్మరన్ రవిచంద్రన్, కమిన్స్, శివాంగ్, మలింగ, షకీబ్ హొస్సేన్, ప్రఫుల్
బెంగళూరు : కోహ్లీ, బెథెల్, పడిక్కల్, పటిదార్(కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, షెఫర్డ్, కృనాల్, భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ, హ్యాజిల్‌వుడ్






