దేశవాళీ క్రికెట్‌పై బీసీసీఐ ఫోకస్
1788 మ్యాచ్‌లతో భారీ షెడ్యూల్
ఆగష్ట్ 23 నుంచి దులీప్ ట్రోఫీ
అక్టోబర్ 11 నుంచి రంజీ ట్రోఫీ
ముంబై, మే 20: దేశవాళీ క్రికెట్‌పై బీసీసీఐ మరింత దృష్టి పెట్టింది. డొమెస్టిక్ స్థాయిలో ప్రమాణాలను మరింత పెంచేలా బీసీసీఐ భారీ షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. 2026 సీజన్‌కు సంబంధించి దేశవాళీ సీజన్ షెడ్యూల్‌ను బోర్డు ప్రకటించింది. ఈ సీజన్‌లో పురుషులు, మహిళల క్రికెట్‌తో పాట వివిధ వయస్సు కేటగిరీల్లో, అన్ని ఫార్మాట్లకు సంబంధించి మొత్తం 1788 మ్యాచ్‌లు నిర్వహించబోతున్నారు.
సీనియర్, అండర్ 23, అండర్ 19, అండర్ 16 విభాగాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.ప్రతిష్టాత్మకమైన రెడ్-బాల్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీతో ఆగస్టు 23 ఈ కొత్త డొమెస్టిక్ సీజన్ ఘనం గా మొదలుకాబోతోంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 6 జోనల్ జ ట్లు తలపడతాయి. దీని తర్వాత అక్టోబర్ 1 నుంచి ఇరానీ కప్ మ్యాచ్ జరగనుంది. జ మ్మూ కాశ్మీర్ ప్రస్తుత రంజీ డిఫెండింగ్ ఛాం పియన్‌గా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ జమ్మూ లేదా శ్రీనగర్‌లో జరిగే అవకాశం ఉంది.
ఆటగాళ్లకు తగినంత విశ్రాం తి, రికవరీ సమయాన్ని ఇస్తూనే మల్టీ-డే (రెడ్-బాల్) క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే లా రంజీ ట్రోఫీ, కల్నల్ సీకే నా యుడు ట్రోఫీల ను ఈసారి కూడా రెండు విడతల ఫార్మాట్లోనే నిర్వహించనున్నారు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‌లో 4 గ్రూపులుగా విభజించిన 32 జట్లు పోటీ పడనుం డగా.. ప్లేట్ గ్రూప్‌లో 6 జట్లు తలపడతాయి.
ఆధునిక క్రికెట్ అభిమానుల అభిరుచులకు అనుగుణంగా దేశవాళీ క్రికెట్‌ను బలోపేతం చేసేందుకు బీసీసీఐ మరికొన్ని కీలక మార్పులు చేసింది. పురుషుల అండర్ 23 స్టేట్ ’ఎ’ ట్రోఫీ, విజ్జీ ట్రోఫీలను వన్డే ఫార్మా ట్ నుంచి టీ20 టోర్నమెంట్లుగా మార్చారు. విజయ్ మర్చంట్ ట్రోఫీని అండర్-16 టోర్నమెంట్‌ను షెడ్యూల్ కంటే కాస్త ముందుకు జరిపారు. ఇప్పుడు ఈ టోర్నీ నవంబర్ నుంచి జనవరి వరకు జరగనుంది.






