జట్టుతో చేరనున్న ఫిల్ సాల్ట్
బెంగళూరు, మే 20: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల ముంగిట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గుడ్‌న్యూస్ అందింది. గాయం కారణంగా పలు మ్యాచ్‌లకు దూరమైన ఓపెనర్ ఫిల్ సాల్ట్ మళ్లీ జట్టుతో చేరనున్నాడు. ఈ వారం చివర్లో భారత్‌కు రానున్నాడు. ఏప్రిల్ 18న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యా చ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా సాల్ట్ చేతి వేలికి గాయమైంది. దీంతో మూడు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే గా యం తీవ్రత తెలుసుకోవడం కోసం సాల్ట్ మే మొదటి వారంలో లండన్‌కు తిరిగి వెళ్లాడు.
స్కానింగ్ పరీక్షల తర్వాత అది తీవ్రమైన గాయం కాదని తేలడంతో మళ్లీ భారత్‌కు వచ్చి ఐపీఎల్ ఆడబోతున్నాడు. అయితే మే 22న ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు సాల్ట్ అందుబాటులో ఉం టాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. కాగా ఆర్‌సీబీ 13 మ్యాచ్‌లలో 18 పాయిం ట్లు సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో ఫిల్ సాల్ట్ ఓపెనర్‌గా ఆర్‌సీబీకి మంచి ఆరంభాలనే అందించాడు. ఆరు మ్యాచ్‌లలో 202 పరుగులు చేశాడు.






