28 June, 2026 | 1:46 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

23న బీసీల చలో ఢిల్లీ

09-03-2026 12:15 AM
  1. జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలి
  2. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా మొదలుకానున్న జాతి జనగణనలో బీసీ కులగనణ చేపట్టాలని, తెలంగాణ రాష్ర్టంలో చేసిన బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదించాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 23న బీసీల చలో ఢిల్లీ చేపట్టినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రకటనలో తెలిపారు.

బీసీల చలో ఢిల్లీ సందర్భంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక రోజు భారీ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. కొన్ని దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా సమగ్ర కులగలను చేపట్టాలని బీసీలు ఉద్యమాలు చేపడితే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి గతేడాది ఏప్రిల్ 30న జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో జాతీ జన గణనలో సమగ్ర కులగన చేపడతామని ప్రకటించిందని గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చినట్లు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి దేశవ్యాప్తంగా లెక్కింపు చేపడుతుందని మొదటి దపాలో కుటుంబ ఇంటి లెక్కలు తీస్తుందని, ఇందులో 33 ప్రశ్నలను రూపొందించి అందులో ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఎన్ని అడిగిన కేంద్ర ప్రభుత్వం బీసీ కుటుంబాల సం ఖ్యను విస్మరించడం చాలా బాధాకరమన్నారు. ఇండ్ల లెక్కింపులో కూడా బీసీ ఇండ్ల ను లెక్కించాలని డిమాండ్ చేశారు. బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శా తం రిజర్వేషన్లు పెంచలేదని, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టం కేంద్ర ప్రభుత్వానికి పంపించి సంవత్సరాల కాలం గడిచినప్పటికీ పార్లమెంటులో ఆమోదించలేదన్నారు.

తక్షణమే ఈ బడ్జెట్ పార్లమెంట్ సమస్యలలో బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ భారీ ధర్నాకు దేశంలోని 29 రాష్ట్రాల నుండి బీసీలంతా పెద్ద ఎత్తున కదిలి వచ్చి విజయవంతం చేయాలని జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు.