హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి
09-03-2026 12:15 AM
కోదాడ, మార్చి 8: కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్ పీ వీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మావతి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం ఈ టీకాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, స్లీపర్లను సన్మానించి వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ వెంకటేశ్వర్లు, సూపరిండెంట్ దశరధ, డిప్యూటీ డీఎంహెచ్ ఓ మాధవ కుమార్, వైద్యులు లక్ష్మణ్, ప్రవీణ్, ప్రియాంక పాల్గొన్నారు.




